జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాయిస్‌ను బలంగా వినిపిస్తోన్న‌ ఛానల్ 99 టీవీ. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఈ టీవీని ఆ పార్టీ నడిపించ‌లేక చేతులెత్తేయడంతో జనసేనలో కీలక నేతగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ఈ ఛానల్ ను టేకోవర్ చేశారు. పేరుకు మాత్రమే ఇది తోట చంద్రశేఖర్ ఛానల్ అయినా కర్త.. కర్మ.. క్రియ అంతా పవన్ కళ్యాణ్ ఛానల్ గానే జ‌నం భావిస్తారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల టైంలో కూడా జనసేన పవన్ కళ్యాణ్ వాయిస్‌ను ఈ ఛానల్ బలంగా వినిపించింది. ఆ ఎన్నికల్లో ఈ ఛానల్ లో జనసేన కు లభించిన కవరేజ్ మీడియా సంస్థలను లభించలేదు.


ఇక ఈ ఛానల్ లో ఇప్పుడు ఉద్యోగుల విషయంలో పెద్ద హింస నడుస్తున్నట్టు మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 99 టీవీలో పనిచేస్తున్న ఉద్యోగులు నాలుగు నెలలుగా జీతాలు లేక  రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. జీతాలు వెంటనే ఇవ్వాల‌ని ప్రశ్నిస్తే.. నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్న ఆన్సర్ మేనేజ్మెంట్ వర్గాల నుంచి వస్తోందట. ఇప్పటికే తెలుగులో ఎక్స్ప్రెస్ టీవీ ఛానల్లో మూతపడి వందలాది మంది జర్నలిస్టులు రోడ్డున పడ్డారు. ఇక‌ ఇప్పుడు 99 ఛాన‌ల్ పరిస్థితి కూడా అదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది.


వాస్తవానికి ఈ ఛానల్ ను ఎన్నికలు ముగిసిన వెంటనే అమ్మకానికి పెట్టారు. అయితే సరైన రేటు రాకపోవడంతో మళ్లీ ఆ ప్రతిపాదన కాస్తా అటకెక్కింది. వాస్తవంగా చూస్తే జనసేనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా సపోర్ట్ అవసరమే. తోట చంద్రశేఖర్ ఛానల్ ను నడిపించాలేన‌ని చేతులెత్తేయడంతో ఇప్పుడు ఈ ఛానల్ ను ఎవరు సొంతం చేసుకుంటారు అన్నది మీడియా వర్గాల్లో ఆసక్తిగా మారింది. కొద్ది రోజుల క్రితం ఓ బడా పారిశ్రామికవేత్త బేరసారాలు ఆడి తాను చెప్పిన రేటుకి ఛానల్ వ‌స్తుంద‌న్న‌ ప్రతిపాదన లేకపోవడంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.


ఇక ఛానల్ ను అమ్మటం సంగతి ఎలా ఉన్నా.. తమ కంట్రోల్ లో ఉన్నంత వరకు అయినా అందులో పనిచేసే ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వాలన్న ఆలోచన కూడా మేనేజ్మెంట్‌కు లేకపోతే ఎలా ? అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి  ఆంధ్రప్రదేశ్‌ తాజా పరిస్థితులపై వీర లెవ‌ల్లో ప్రసంగాలు చేసే పవన్ కళ్యాణ్ తమ పార్టీకి సపోర్ట్ గా ఉన్న ఛానల్ లో పనిచేసే ఉద్యోగుల బాధలు పట్టించుకుంటే మంచిదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: