తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్  మీద వేటు పడనుందని తెలుస్తోంది. అనిల్ కుమార్ సింఘాల్ అక్కడ  లాంగ్ స్టాండింగ్ అన్నది తెలిసిందే. ఆయన చంద్రబాబు హయాంలో టీటీడీ ఈవోగా చేరారు. ఇక ఆయన ఎపుడైనా వేరే చోటకు  బదిలీ కావచ్చునని జగన్ సీఎం అయ్యాక కొత్తల్లో  వినిపించింది. అయితే ఇంతకాలం పాలన మీదనే ద్రుష్టి పెట్టిన జగన్ ఇపుడు తనకు అనుకూలంగా ఉండే అధికారులను తెచ్చుకోవడంపైన ద్రుష్టి పెడుతున్నారు.


ఈ నేపధ్యంలో  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేశారు. ఈయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ ను నియమించనున్నట్లు తెలిసింది. జేఎస్వీ ప్రసాద్ ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్టులో సతీష్ చందర్ ను ప్రభుత్వం నియమించింది. అనిల్ కుమార్ సింఘాల్ చంద్రబాబు హయాంలో టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. ఆయన బదిలీ ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నట్లు సమాచారం.


ఇక ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేసిన జగన్ ఆ ప్లేస్ లో  నీలం సహానీని తీసుకువస్తున్నారు. అదే విధంగా చాలా మంది ఐఏఎస్ లను బదిలీ పేరిట మార్చేస్తారని కధనాలు వస్తున్నాయి. చాలా మంది ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాత సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారని అంటున్నారు. వారి వల్లనే సులువుగా వైసీపీ సర్కార్ మీద విమర్శించేందుకు బాబుకు పట్టు దొరుకుతోందని జగన్ అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ కొరడా పట్టి ఝలిపించడం మొదలుపెట్టారు. చాలా మంది జాతకాలు తేలబోతున్నాయి అని ఏపీ సచిలాలయంలో వినిపిస్తున్న మాట. మొత్తానికి ఎవరు దొరుకుతారో, ఎవరికి ఏ ప్లేస్ నుంచి ఉద్వాసన ఉంటుందో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: