రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహిసీల్దారు విజయారెడ్డి సోమవారం మధ్యాహ్నం దారుణమైన హత్యకు గురికాబడ్డారు. సురేష్ అనే వ్యక్తి ఎవరు లేని సమయం గుర్తించి ఎమ్మార్వో విజయారెడ్డి పై పెట్రోలు పోసి నిప్పంటించాడు. దానితో ఆమె అక్కడిక్కడే దద్దరిల్లే హహంకారాలతో కొట్టుమిట్టాడుతూ సజీవదహనం అయ్యారు.


ఇది తెలుసుకున్న సాటి రెవిన్యూ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి న్యాయం జరగాలంటూ నిరసనలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే నిరసనలో ఒక భాగంగా గుండాల ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా కొంతమంది వీఆర్వోలు నిరసన చేపట్టారు.
అయితే అక్కడే నిరసనలో కూర్చునా ఓ వీఆర్వో వద్దకు ఒక సాధారణమైన మహిళా వచ్చీ, " ఒరేయ్ నువ్ నా దగ్గర రెండు వేలు తీసుకున్నవి ఇయ్యి... ఇయ్యకుంటే గల్లా పడతా.. మేం కష్టపడి సంపాదించినం అవి", అంటూ నిలదీసింది.

ఇంతకీ విషయమేంటంటే ఈ వీఆర్వో ఆమె దగ్గర 2 వేల లంచం తీసుకొని పాసుబుక్ ఇవ్వకుండా చాలా రోజులు తిపిస్తున్నాదంట. ఆమె అలా మొహం పట్టుకొని నిలదీస్తుంటే అక్కడ ఉన్న రెవిన్యూ ఉద్యోగులంతా సైలెంట్ అయ్యిపోయి తర్వాత చిన్నగా అక్కడినుంచి లేచిపోయారు. 


ఈ సంఘటన చూస్తుంటే రెవిన్యూ శాఖలో చాలా మంది లంచగొండిలు ఉన్నారనే విషయం స్పష్టమవుతుంది. అయితే విజయారెడ్డి హత్య వెనుక మాత్రం సురేష్ అనే వ్యక్తికి సంబంధించిన భూమి పట్టాదార్ పాసుబుక్ కొన్ని కారణాల వల్ల తొందరగా ఇవ్వకపోవడమే అని సమాచారం. విజయారెడ్డి ఒక స్కూల్ టీచర్ గా పని చేసి ఆ తర్వాత తహసీల్దార్ ఉద్యోగాన్ని ఎంతో కస్టపడి సాధించారు. ఆమెకు 2018 లో బెస్ట్ మండల్ రెవిన్యూ ఆఫీసర్ గా అవార్డు కూడా లభించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఒకరు పదేళ్ల అమ్మాయి ఐదేళ్ల అబ్బాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: