ప్రస్తుతం మార్కెట్లో ఇప్పుడున్న టెలికాం నెట్‌వర్క్‌లకు ధీటుగా వొడా ఫోన్ నెట్‌వర్క్ తన ప్రయాణం కొనసాగించాలని ప్రయత్నిస్తుంది. ఇందుకు గాను సరి కొత్త ప్లాన్లతో ముందుకు వస్తుంది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్,  నెట్ వర్క్‌లు కొత్త కొత్త ఆఫర్లతో కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. అందుకే వొడాఫోన్ కూడా ఈ మధ్యకాలంలో వివిధ ప్లాన్లను పరీక్షించే పనిలో పడింది. ఈ క్రమంలోనే తన కొత్త ఆల్ రౌండర్ రూ.39 ప్లాన్ ను తీసుకువచ్చింది.


ఈ ప్లాన్ రీచార్జ్ తో లాభాలు ఏంటంటే ఫుల్ టాక్ టైం, డేటా, రేట్ కట్టర్ వంటి లాభాలు లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ ప్లాన్ అంటే వొడాఫోన్ అతి తక్కువలో అందించే రీచార్జ్ ప్లాన్లు. ఈ ప్లాన్లు రూ.35 నుంచి ప్రారంభం అవుతాయి. అయితే వొడాఫోన్ తన సర్కిళ్లలో వివిధ ప్లాన్లను ప్రవేశపెడుతూ వాటిని పరీక్షిస్తూ ఉంది. ఇప్పటికే వొడాఫోన్ రూ.45, రూ.69 ప్లాన్లను తీసుకువచ్చింది. ఇకపోతే ఏడు రోజుల వ్యాలిడిటీ రూ.9 అదనపు టాక్ టైం రూ.30 రీచార్జీతో  లభిస్తాయి. అంతే కాకుండా ఈ ప్లాన్ తో 100 ఎంబీ డేటా లభిస్తుంది. అలాగే సెకనుకు 2.5 పైసల చార్జీతో వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ దాదాపుగా రూ.35 ప్లాన్ మాదిరిగానే ఉంటుంది.


ఇక మరో ప్లాన్ రూ.35తో రీచార్జ్ చేసుకుంటే రూ.26 టాక్ టైం, 100 ఎంబీ డేటా, వాయిస్ కాల్స్ కు సెకనుకు 2.5 పైసల చార్జీ వంటి లాభాలు ఉంటాయి. ఈ రెండు ప్లాన్లలో రూ.39 ప్లానే మెరుగైన ఎంపిక అనుకోవచ్చు. ఎందుకంటే మీరు రూ.4 అదనంగా పెడితే ఇందులో దాదాపు ఫుల్ టాక్ టైం లభిస్తుంది. అదీ కాకుండా ఈ డేటా ఉపయోగించుకోవడానికి వొడాఫోన్ తాజా టెక్నాలజీ అయిన టర్బోనెట్ 4జీ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ  రూ.39 ప్లాన్ తో పాటుగా వొడాఫోన్. రూ.15, రూ.29 ప్లాన్లు కూడా లాంచ్ చేసింది. కాని ఈ రెండు ప్లాన్లూ కేవలం ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.


ఇకపోతే ఈ రెండు ప్లాన్లూ డేటా, టాక్ టైం ప్లాన్లు కావు. కేవలం రేట్ కట్టర్ ప్లాన్లు మాత్రమే. ఈ రీచార్జ్ లు చేసుకుంటే  నిమిషానికి 30 పైసలు మాత్రమే కాల్ కాస్ట్ పడుతుంది. దేశంలో ఉన్న ఏ నంబర్ కు కాల్ చేసినా ఈ  చార్జీలే వర్తిస్తాయి. రూ.15 ప్లాన్ వ్యాలిడిటీ 3 రోజులు కాగా, రూ.29 ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులుగా ఉంది. ప్రస్తుతానికి ఈ ప్లాన్లు ముంబై, కర్ణాటక సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. ఇవండి వొడా ఫోన్ తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రవేశ పెట్టిన రీచార్జ్ ఫ్లాన్స్..


మరింత సమాచారం తెలుసుకోండి: