రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో తహసిల్దార్ విజయ రెడ్డి హత్య తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఓ రైతు లంచం అడిగిందంటూ  విజయ రెడ్డి పై పెట్రోల్ పోసి అందరూ చూస్తుండగానే సజీవ దహనం చేసిన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. సురేష్ అనే నిందితుడు మధ్యాహ్నం సమయంలో అందరూ చూస్తుండగానే తహసిల్దార్ విజయారెడ్డి కార్యాలయంలోకి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి తనపై తాను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే నిప్పు అంటుకున్న తహసిల్దార్ విజయారెడ్డి రక్షించేందుకు అక్కడి సిబ్బంది ప్రయత్నించగా వాళ్లకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అందరూ చూస్తుండగానే తహసిల్దార్ విజయారెడ్డి సజీవదహనం అయిపోయింది. కాగా  పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు సురేష్  పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. 



 అయితే తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్  తహసీల్దార్ విజయారెడ్డి పై జరిగిన హత్య సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా తహసిల్దార్ విజయారెడ్డి హత్య దారుణమైన,  దురదృష్టకరమైన సంఘటన అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తాసిల్దార్ విజయారెడ్డి, ఆమె డ్రైవర్ గురునాథం కుటుంబ సభ్యులకు చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాజంలో అసహనం రోజురోజుకు ఎంతగా పెరిగిపోతుంది ఈ ఘటన  ద్వారా అర్థమవుతుంది అంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.



 ఇలాంటి అవాంఛనీయ ఘటనలు ప్రతి ఒక్కరు ఖండించాలి అంటూ చంద్రబాబు నాయుడు కోరారు. టెక్నాలజీ పరంగా రోజురోజుకు సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంటే.... మనిషి మాత్రం మానసికంగా రోజు రోజుకు మరింత క్రూరంగా  అనాగరికంగా తయారవడం నిజంగా శోచనీయమని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. కాగా  తహసిల్దార్ విజయ రెడ్డి హత్య పై  ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తహసిల్దార్ విజయ రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసనలు తెలుపుతున్నారు ఉద్యోగ సంఘాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: