ఆంధ్రప్రదేశ్ లో ఇసుక సమస్య విషయ౦లో గత కొంత కాలంగా విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం భారీ ఎత్తున నిరసనలు చేసింది. యువనేతలతో ధర్నాలు చేయించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు. రాజకీయంగా బలహీనపడిన పార్టీకి ఇప్పుడు ఇసుక సంజీవని గా మారిందని కొందరు కథనాలు రాయడం కూడా జరిగింది. ఇక తెలుగుదేశానికి జత కలిసిన పవన్ కళ్యాణ్ ఒక పిలుపు ఇచ్చి విశాఖలో లాంగ్ మార్చ్ చేసి ప్రభుత్వాన్ని తిట్టారు.


అంత వరకు బాగానే ఉంది గాని... అసలు ఇసుక కొరత ఉందా...? సరే ఉందీ అనుకుందాం... రాష్ట్రంలో గత మూడు నెలలుగా తీవ్ర స్థాయిలో వరదలు ఉన్నాయి. వరదలు ఉన్నాయి అంటే ఇసుకను నిల్వ చేసుకోలేరా అనే ప్రశ్నలు వేస్తున్నారు కొందరు సీనియర్ నేతలు. నూతన ఇసుక పాలసీని ఇసుక దళారుల భారి నుంచి బయటకు రావడానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. సముద్రంలో నీళ్ళ మాదిరి ఇసుక తోడుకుంటున్న వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.


తెలుగుదేశం నేతలకు అది కాస్త షాక్ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి ఇసుక లేదని, కూలీలు లేరని విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అసలు మరో సమస్య అనేది వాళ్లకు కనపడలేదా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల నుంచే వినపడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు విభజన హామీలని హడావుడి చేసిన చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం లేదు. పోలవరం ప్రాజెక్ట్ నిధుల గురించి ఒక్క మాట లేదు.


ఎంత సేపు ఇసుక లేదని విమర్శలు చేయడం మొదలుపెట్టారు. తెలంగాణా నుంచి రావాల్సిన వాటి గురించి మాట రావడం లేదు. ఇవన్ని పక్కన పెట్టి ఎంత సేపు ఇసుక ఇసుక అంటూ తన పార్టీ నేతలకు ఒక టాపిక్ ఇచ్చి దాని మీద పరీక్ష రాయండి అన్న చందంగా బాబు వ్యవహారశైలి ఉందని ఆ పార్టీ కార్యకర్తలే అనడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: