దేశవ్యాప్తంగా రోజురోజుకు బ్యాంకుల్లో  మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రజలను మోసం చేస్తూ ప్రజల డిపాజిట్ చేసిన సొమ్ముతో చెక్కేసి  మోసం చేసే  బ్యాంకులకు కొన్నైతే.... ప్రజల  నుండి అక్రమంగా వసూలు చేపడుతున్న బ్యాంకులు ఇంకొన్ని  . ఈ నేపథ్యంలో దేశం మొత్తంలో ఇప్పటివరకు బ్యాంకు మోసాలపై 35 కేసులు నమోదయ్యాయి. కొన్ని వేల కోట్లకు పైగా బ్యాంకు మోసాలు జరిగినట్లు తెలిస్తోంది . బ్యాంకు మోసాలను తగ్గించి... ప్రజలకు మెరుగైన బ్యాంకు సేవలు అందించేందుకు సిబిఐ నడుంబిగించింది. బ్యాంకు మోసాల విషయంలో ఇప్పటికే గతంలో పలుమార్లు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది సిపిఐ. 

 

 

 

 ఇక తాజాగా మరోసారి సీబీఐ దేశవ్యాప్తంగా బ్యాంకుల మోసాల నేపథ్యంలో సోదాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా నూట అరవై తొమ్మిది చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంకు మోసాలను గుర్తించి తగ్గించేందుకు సిబిఐ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు వరకు 7 వేల కోట్ల విలువ చేసే బ్యాంకు మోసాలు కేసుల నేపథ్యంలో సిబిఐ ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సిబిఐ సోదాలు వల్ల బ్యాంకుల్లో  జరుగుతున్న మోసాలను గుర్తించేందుకు సోదాలు  జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే బ్యాంకు మోసాల విషయంలో ఇప్పటివరకు 35 కేసులు నమోదైనట్లు సమాచారం. 

 

 

 

 దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లోని బ్యాంకుల్లో సోదాలు నిర్వహిస్తోంది సిబిఐ. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ సహా గుజరాత్,  హర్యానా,  కర్ణాటక,  కేరళ,  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తమిళనాడు, ఉత్తరప్రదేశ్,  ఉత్తరాఖండ్,  దాద్రా నగర్ హవేలీ లోని పలు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు నేడు సోదాలు నిర్వహించారు. అయితే సీబీఐ అధికారులు బ్యాంకుల్లో సోదాలు నిర్వహించినప్పటికీ...ఏ ఏ  బ్యాంకుల్లో సోదాలు నిర్వహించారు అనేది  వెల్లడించలేదు సీబీఐ అధికారులు. మోసాలకు పాల్పడుతున్న బ్యాంకులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని సిబిఐ అధికారులు స్పష్టం చేశారు. బ్యాంకులో జరుగుతున్న మోసాలను గుర్తించి మోసాలకు పాల్పడుతున్న బ్యాంకులను సీజ్ చేసేందుకే సి.బి.ఐ సోదాలు  చేపడుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 7 వేల కోట్ల విలువ చేసే బ్యాంకు మోసాలు కేసులు నమోదయినందున  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో  మొత్తంగా 169 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాకా గతంలోనూ సీబీఐ  దేశవ్యాప్తంగా బ్యాంకు మోసాలపై పలుమార్లు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: