నారా లోకేష్ కి అభద్రతా భావం ఎక్కువ" ఇటీవల తెలుగుదేశం నేతల్లో ఎక్కువగా వినపడుతున్న మాట. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ఇప్పుడు పార్టీకి భవిష్యత్తు నేత. ఆయన చేతుల్లోనే తెలుగుదేశం అడుగులు వెయ్యాల్సి ఉంటుంది. మరి అలాంటి నేత ఆలోచనా సరళి ఏ విధంగా ఉంది...? దీనికి తెలుగుదేశంలో ఉన్న కొందరు నేతల నుంచి విభిన్న సమాధానాలు వస్తాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రకటించి, గురజాల వెళ్లి బాధితులను కూడా పరామర్శించారు.


దీనితో లోకేష్ బాబులో అభద్రతా భావం ఎక్కువైంది. అవినాష్ మీకంటే సమర్ధత ఉన్న నాయకుడు అని ఎవ‌రో అనగానే ఎక్కడో చదువుకుని వచ్చిన లోకేష్ ఇబ్బంది పడ్డాడ‌ట‌. ఇక అక్కడి నుంచి అవినాష్ ని పక్కన పెట్టారు. ఇక అనంతపురం జిల్లాలో పార్టీకి నమ్మకంగా ఉన్న పరిటాల కుటుంబం విషయంలో కూడా ఇదే జరిగింది. పరిటాల శ్రీరాం కి ఉన్న క్రేజ్ చూసిన లోకేష్ అది చూసి బాగా ఇబ్బంది పడ్డారని, అందుకే ఆయన విజయవాడ పార్టీ సమావేశాలకు వచ్చినా కనీసం ఫోటో కూడా దిగడం లేదని అంటున్నారు. ఇక్కడ మరో విషయం వెలుగులోకి వచ్చింది.


రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బ్రతకాలి అంటే శ్రీకాకుళం ఎంపీ గా ఉన్న రామ్మోహన్ నాయుడుకి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలని కార్యకర్తలు కోరడంతో తన ప్రాధాన్యత కార్యకర్తల్లో తగ్గుతుందని భావించి లోకేష్ ఇబ్బంది పడి రామ్మోహన్ నాయుడు తో మాటలు తగ్గించారు. ఇక గల్లా జయదేవ్ పాపులారిటి చూసిన లోకేష్ ఆయనతో కూడా మాటలు తగ్గించారని అంటున్నారు. ఇలా క్రేజ్ ఉన్న యువనేతల కారణంగా తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని, సొంత పార్టీ నేతలే వారిని చూసి నేర్చుకోవాలని సలహాలు ఇస్తున్నారని లోకేష్ అభద్రతా భావంలో ఉన్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: