నిరంతరం ప్రజల కోసమే తపిస్తూ....వారి జీవితాల్లో వెలుగు చూడాలన్నదే ఆయన లక్ష్యం. వారికి మరింత చేరువ కావాలని, వారి కష్టాలు దగ్గరగా చూడాలని తలంచిన రాజన్న బిడ్డ, సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వేసే ప్ర‌తి అడుగులో విశ్వాసంతో...  అవినీతి, అన్యాయంపై ఓ వెనుదిరగని అస్త్రం రూపంలో...వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేసిన సుదీర్ఘ ‘ప్రజా సంకల్ప యాత్ర’ ప్రారంభ‌మై రెండేళ్లు కావ‌స్తోంది. ఇడుపులపాయలో 2017, నవంబరు 6న ప్రారంభమైన వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర,  341 రోజుల పాటు సాగి, 2019 జవనరి 9న ఇచ్ఛాపురం వద్ద ముగిసింది.


జిల్లాల వారీగా...జ‌గ‌న్ పాద‌యాత్ర విశేషాలివి
వైయస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో 2017, నవంబరు 6న ప్రారంభమైన వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర 5 నియోజకవర్గాలలో 7 రోజుల పాటు 93.8 కి.మీ కొనసాగింది. 
కర్నూలు జిల్లాలో..
అదే ఏడాది నవంబరు 13న యాత్ర 7వ రోజు ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగలమర్రి వద్ద కర్నూలు జిల్లాలో ప్రవేశించిన వైయస్‌ జగన్‌ 18 రోజుల పాటు 263 కి.మీ నడిచారు. 
‘అనంతపురం’లో..
ఆ తర్వాత యాత్ర 26వ రోజు, 2017, డిసెంబరు 4న అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టిన వైయస్‌ జగన్, 20 రోజులు పర్యటించి 9 నియోజకవర్గాలలో 279.4 కి.మీ నడిచారు. 
చిత్తూరు జిల్లాలో.. 
పాదయాత్రలో 46వ రోజు, 2017, డిసెంబరు 28న ఎద్దులవారికోట వద్ద చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన వైయస్‌ జగన్, 23 రోజుల పాటు 10 నియోజకవర్గాలలో 291.4 కి.మీ నడిచారు. 
‘కోస్తా’ లోకి ప్రవేశం
యాత్ర 69వ రోజు, 2018, జనవరి 23వ తేదీన వైయస్‌ జగన్‌ సుదీర్ఘ పాదయాత్ర కోస్తాలోకి ప్రవేశించింది. నెల్లూరు జిల్లా పీసీటీ కండ్రిగ వద్ద ఆయన కోస్తాలోకి అడుగు పెట్టారు. 
నెల్లూరు జిల్లాలో 20 రోజుల పాటు 9 నియోజకవర్గాలలో యాత్ర చేసిన జననేత 266.5 కి.మీ నడిచారు. 
ప్రకాశం జిల్లాలో..  
యాత్ర 89వ రోజు, 2018, ఫిబ్రవరి 16న కందుకూరు నియోజకవర్గం, లింగ సముద్రం మండలంలోని కొత్తపేట వద్ద ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన వైయస్‌ జగన్, 21 రోజులు పర్యటించారు.
గుంటూరు జిల్లాలో..
మార్చి 12వ తేదీ, యాత్ర 110వ రోజున బాపట్ల నియోజకవర్గం, అదే మండలంలోని స్టూవర్టుపురం వద్ద గుంటూరు జిల్లాలోకి అడుగు పెట్టిన  వైయస్‌ జగన్, 12 నియోజకవర్గాలలో 26 రోజులు పర్యటించారు. జిల్లాలో 281 కి.మీ నడిచారు.
కృష్ణా జిల్లాలో..
ఆ తర్వాత ఏప్రిల్‌ 14వ తేదీ, యాత్ర 136వ రోజున కనకదుర్గమ్మ వారధి వద్ద యాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించగా, 24 రోజుల పాటు 239 కి.మీ నడిచారు. 
‘పశ్చిమ గోదావరి’ లో..
యాత్ర 160వ రోజు, 2018 మే 13న దెందులూరు నియోజకవర్గం, కలకర్రు వద్ద పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టిన  వైయస్‌ జగన్, 13 నియోజకవర్గాలలో పర్యటించారు. జిల్లాలో 27 రోజుల పాటు 316.9 కి.మీ నడిచారు.
‘తూర్పు గోదావరి’ లో.. 
జూన్‌ 12వ తేదీ, యాత్ర 187వ రోజున కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరి మాతకు హారతి, ప్రత్యేక పూజల అనంతరం గోదావరి రైల్‌ కమ్‌ రోడ్‌ వంతెన మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్న వైయస్‌ జగన్‌ తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టారు. జిల్లాలో సరిగ్గా రెండు నెలలు సాగిన జననేత పాదయాత్ర ఆగస్టు 13న ముగిసింది. జిల్లాలో 50 రోజులు, 17 నియోజకవర్గాలలో 412 కి.మీ నడిచారు. 
‘విశాఖ’ జిల్లాలో.. 
2018 ఆగస్టు 14వ తేదీ, యాత్ర 237వ రోజున నర్సీపట్నం నియోజకవర్గం, నాతవరం మండలంలోని గన్నవరం మెట్ట వద్ద జననేత ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలో 32 రోజుల పాటు, 12 నియోజకవర్గాలలో పర్యటించిన వైయస్‌ జగన్, 277.1 కి.మీ నడిచారు.
‘విజయనగరం’ లో.. 
సెప్టెంబరు 24వ తేదీ, యాత్ర 269వ రోజున ఎస్‌.కోట నియోజకవర్గం కొత్తవలస మండలంలోకి అడుగు పెట్టిన వైయస్‌ జగన్‌ విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు.  
ఈ స‌మ‌యంలోనే హత్యా ప్రయత్నం జ‌రిగింది.
---2018,అక్టోబరు 25న జిల్లాలో 294వ రోజు యాత్ర పూర్తి చేసుకున్న వైయస్‌ జగన్, హైదరాబాద్ ప‌య‌న‌మ‌య్యేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడి విఐపీ లాంజ్‌లో ఆయనపై హత్యా ప్రయత్నం జరిగింది.దీంతో ప్రజా సంకల్పయాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. 17 రోజుల విరామం తర్వాత నవంబరు 12వ తేదీన యాత్ర తిరిగి మొదలైంది.
విజయనగరం జిల్లాలో మొత్తం 36 రోజుల పాటు 9 నియోజకవర్గాలలో పర్యటించిన వైయస్‌ జగన్‌ 311.5 కి.మీ నడిచారు. 
‘శ్రీకాకుళం’ జిల్లాలో..
యాత్ర 305వ రోజు, 2018 నవంబరు 25న పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలోని కడకెల్ల వద్ద శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన వైయస్‌ జగన్‌ ఇదే జిల్లాలో యాత్ర 341వ రోజు, 2019, జనవరి 9న ఇచ్ఛాపురం వద్ద సుదీర్ఘ పాదయాత్ర ముగించారు. జిల్లాలో మొత్తం 37 రోజుల పాటు 10 నియోజకవర్గాలలో పర్యటించిన వైయస్‌ జగన్‌ 338.3 కి.మీ నడిచారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: