తెలుగు దేశం పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఘోరంగా దెబ్బతిన్నది. కనీసం కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. అటు చూస్తే చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా మంగళగిరిలో ఓడిపోయి దీన స్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు దేశాన్ని కాపాడే నాయకుడు ఒకే ఒక్కడున్నారట. అతనెవరో తెలుసా.. అతనే పవన్ కల్యాణ్ అంటున్నారు కొందరు.


అదేంటి పవన్ కల్యాణ్ తెలుగు దేశాన్ని కాపాడటమేంటి.. అనుకుంటున్నారా.. రాజకీయాల్లో అంతేనట. తెలుగు దేశం కష్టాల్లో ఉన్నప్పుడల్లా చంద్రబాబు పవన్ అస్త్రం ప్రయోగిస్తున్నారని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని కష్టాల్లో ఆదుకునే నాయకుడు పవన్‌ అంటున్నారు. అందుకే ఇప్పుడు తెలుగుదేశాన్ని ఇసుక సాకుతో కష్టాల్లోంచి పైకి లాగాలని ప్రయత్నిస్తున్నాడట.


చంద్రబాబు ఇసుకను పవన్‌ భుజాల పెట్టారట. విశాఖలో పవన్‌ రెండున్నర కిలోమీటర్ల లాంగ్‌ మార్చ్‌ కారు మీద నిలబడి చేశారు. పవన్‌కు సమస్య మీద కనీస అవగాహన ఉందా..? భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. అచ్చెన్నాయుడు గతంలో కార్మిక శాఖ మంత్రిగా ఉండి భవన కార్మికుల నిధులను పక్కదారి పట్టించాడు. అచ్చెన్నాయుడి భుజం మీద చేయి వేసి మాట్లాడిన పవన్‌కు ఇసుక గురించి, కార్మికుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. అంటున్నారు వైసీపీ నేతలు.


ఓవైపు పెద్ద ఎత్తున వరదలతో అన్ని ప్రాజెక్టులు నిండాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇసుక తీసే పరిస్థితి లేదు. ఇసుకలో తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి అరికట్టాలని పాలసీ తీసుకువచ్చారు. పాలసీ అమలు చేస్తున్న తరుణంలో డిమాండ్‌కు సప్లయ్‌కి అంతరం పెరిగింది. దీన్ని పరిష్కరించడం కోసం సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు కూడా ఇచ్చారు. వాగుల్లో, వంకల్లోని ఇసుక ఎమ్మార్వో అనుమతితో తీసుకోవచ్చని ఆదేశాలు కూడా ఇచ్చారు.


వరదలు తగ్గగానే ఇసుక తీస్తారు... కానీ ఇసుక కొరత ద్వారా వచ్చే పరిణామాలను రాజకీయంగా అందిపుచ్చుకోవాలని గుంటనక్కలాగా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుందంటున్నారు వైసీపీ నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: