సాక్షాత్తూ ముఖ్యమంత్రే రెండు సార్లు వార్నింగ్ ఇచ్చినా ఆర్టీసీ కార్మికులు ఏమాత్రం బెదరలేదు. సమ్మె ప్రారంభించిన మొదటి రోజే సాయంత్రంలోపు విధుల్లో చేరకపోతే సెల్ఫ్ డిస్మిస్ అవుతారని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు సమ్మె ప్రార్ంభమై దాదాపు నెల దాటిపోయింది. తాజాగా నాలుగు రోజుల క్రితం సీఎం మరోసారి డెడ్ లైన్ విధించారు. నవంబర్ 5 అర్థరాత్రి లోపు డ్యూటీలో చేరకపోతే.. ఉద్యోగం ఉండదని చెప్పారు.


కానీ ఈ మాటలను కూడా ఆర్టీసీ ఉద్యోగులు పెద్దగా పట్టించుకోలేదు. దాదాపు 50 వేల మంది కార్మికుల్లో కేసీఆర్ వార్నింగ్ తో కేవలం 200 మంది మాత్రమే విధుల్లో చేరారు. అంటే నథింగ్ అన్నమాట. టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె యధాతధంగా కొనసాగుతోంది. నవంబర్ 5 రాత్రి 12 గంటలోపు కార్మికులు చేరని పక్షంలో మిగతా 5,000 రూట్లను కూడా ప్రైవేటీకరణ చేస్తాం అని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఈ డెడ్‌లైన్ వల్ల ఇప్పటివరకు దాదాపు 208 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరినట్లు సమాచారం. కేసీఆర్ ఈ నెల 2న ప్రెస్ మీట్ పెట్టి డెడ్‌‌లైన్ విధించగా.. 3వ తారీఖున 17 మంది చేరారు. 4 వ తేదీన ఆ సంఖ్య 34కు చేరుకుంది. ఇక నవంబర్ 5 రోజు రాత్రి 7 గంటల వరకు 157 మంది సదరు డిపోల వద్ద దరఖాస్తులను అప్పగించినట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి చర్య తీసుకుంటారో.


కేసీఆర్ డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో సమ్మె చేస్తున్న కార్మికులు అందరి అభిప్రాయాలు తీసుకుని ఓ నిర్ణయానికి తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది . కార్మికుల నిర్ణయమే తుది నిర్ణయం అని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. కార్మికులు తాడో పేడో తేల్చుకునేందుకే సిద్ధమయ్యారని దీన్ని బట్టి అర్థం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: