పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి పెద్దగా సాధించింది ఏమీ లేకపోయినా.. ఆయన పబ్లిసిటీకి మాత్రం లోటు లేదు. సినిమా స్టార్ కావడం.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండటం.. కాపు యూత్ అంతా పవన్ ను ఓన్ చేసుకోవడం వంటి కారణాలతో పవన్ అంటే మంచి క్రేజ్ ఉన్నమాట వాస్తవం. అయితే కేవలం ఆ క్రేజ్ ను నమ్ముకుని పవన్ రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.


పవన్ కల్యాణ్ వైసీపీ మంత్రిని పర్సనల్ గా టార్గెట్ చేయడంతో కన్నబాబు కూడా పవన్ పై సెటైర్లు వేశారు. ప్రత్యేకంగా పవన్ పబ్లిసిటీ స్టంట్లను ఎండగట్టారు. మట్టిపిడతల్లో పెరుగన్నం తినడం. కారు డిక్కీలో కూర్చొని టీ తాగడం, రైల్లో టాయిలెట్‌ పక్కన కూర్చొని పుస్తకాలు చదువుతుంటాడు. రైల్లో టాయిలెట్‌ పక్కన రెండు నిమిషాలు ఉండేందుకే మనం జంకుతాం. మట్టిపిడతలు ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయా..? అంటూ కన్నబాబు విరుచుకుపడ్డారు.


గిరిజన ప్రాంతాల్లోకి వెళ్లినా ప్లేట్లు ఇస్తున్నారు. మట్టిపిడతల్లో తింటూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడు. ఆవులకు అరటిపళ్లు పెడుతూ ఫొటో షూట్‌.. ఈ రాష్ట్రంలో గోమాతలను పూజించేవారు అనేక మంది ఉన్నారు. ప్రతిరోజు అరటిపండ్లు పెడుతూనే ఉంటారు.. వారు సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారా..?.. అంటూ పవన్ గాలి తీసేశాడు కన్నబాబు.


చంద్రబాబు తప్ప వేరే నాయకుడు ఉన్నాడని పవన్‌ కల్యాణ్‌ అనుకోడేమో. అందుకే చంద్రబాబు స్క్రీప్టు రెడీ చేయగానే యాక్టింగ్‌ చేయడానికి వస్తుంటాడు. చంద్రబాబు డైరెక్షన్‌ అయితే ఆ యాక్టింగ్‌లు మనేయండి పవన్‌ సీన్‌ పండడం లేదు. సీఎం వైయస్‌ జగన్‌ అంటే పవన్‌కు జెలస్‌.. సీఎం వైయస్‌ జగన్‌తో పవన్‌కు పోలిక ఏంటీ..? ఒక్కచోట గెలవని నువ్వే భూమి మీద నిలబడడం లేదు. రాజకీయం అంటే వైయస్‌ జగన్‌ను చూసి నేర్చుకో.. ఎదిగే కొద్ది ఒదగమనే సూత్రానికి నిదర్శనం వైయస్‌ జగన్‌. వైయస్‌ జగన్‌ను చూసి సంస్కారం నేర్చుకో అంటూ పవన్ తీరుపై మండిపడ్డారు కన్నబాబు .


మరింత సమాచారం తెలుసుకోండి: