ఏపీలో ప్రతిపక్షాలన్ని ఏకమై విమర్శిస్తూ, అడుగడుగున అడ్డుతగులుతున్న రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భావి పౌరుల జీవితాలు బాగుపడతాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు చదుతున్న చదువుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు తప్పని సరిగ్గా మారాయి. ఒకరకంగా ఈ కాలంలో తెలుగు మీడియం చదివిన పిల్లలకు కాస్త ఇబ్బందే ఎదురవుతుందని చెప్పవచ్చూ.


మరి ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువాలంటే మధ్యతరగతి బ్రతుకులకు కాస్త ఖర్చుతో కూడుకున్న పనే అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం నవంబరు 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే విడతల వారీగా 1 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను అమలు చేయనున్నామని తెలిపింది. ఇకపోతే 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు, 2021-22 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతికి, 2022-23 విద్యాసంవత్సరం నుంచి 10 తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేయనుంది.


ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయా తరగతుల్లో తెలుగు లేదా ఉర్దూను తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని కూడా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇదే కాకుండా సంబంధిత ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి వీలుగా.. వారికి అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిక్షణ, హ్యాండ్‌ బుక్స్‌ రూపకల్పన, ఉత్తమ బోధన పద్ధతుల గురించి వివరించడం,


వారికి అవసరమైన మెటీరియల్‌ను రూపొందించే బాధ్యతను స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌కి అప్పగించింది.. ఈ నిర్ణయం వల్ల ఎందరో పేద విద్యార్ధులకు లబ్ది చేకూరనుందని తెలుస్తుంది. ఆ నిర్ణయాన్ని రాష్ట్రమంతటా కఠినంగా అమలుచేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్దులు ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇక జగన్ నిర్ణయాన్ని పేద మద్య తరగతి ప్రజలు అభినందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: