వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో మంది నాయకులూ జగన్ కు అండగా నిలబడ్డారు. అలాంటి వ్యక్తుల్లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతీ ఒకరు. వైసీపీలో ఉంటూ టీడీపీ నాయకులను .. చంద్రబాబును ఒక ఆట ఆదుకున్నారు. కానీ ఏనాడూ లక్ష్మీపార్వతీ జగన్ ను చిన్న పదవి కూడా కోరలేదు. అయితే ఇప్పుడు జగన్ సీఎం అయ్యాడు కాబట్టి లక్ష్మిపార్వతి కోసం ఒక నామినేటెడ్ పదవి ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. పదవులు ఆశించకుండానే... వైసీపీని టార్గెట్ చేసిన టీడీపీకి చెందిన పలువులు కీలక నేతలను ఓ రేంజిలో ఆటాడేసుకున్న లక్ష్మీపార్వతి... టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు విషయంలో తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 


టీడీపీ పార్టీని ఎప్పుడు తన విమర్శలతో ఇరుకున పెట్టే లక్ష్మీపార్వతీ ..  జగన్ ప్రభుత్వం కొలువు దీరిన ఇంత వరకు ఏ పదవి రాలేదు. అయితే జగన్ తనను నమ్మినవాళ్లు అడిగినా అడగకున్నా వారిని మరిచిపోయే రకం కాదు కదా. ఈ క్రమంలోనే లక్ష్మీపార్వతికి ఇప్పుడు ఓ నామినేటెడ్ పదవిని జగన్ కేటాయించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా లక్ష్మీపార్వతికి ఏమాత్రం సంబందం లేని వ్యవహారాలు కాకుండా... రాజకీయాల్లోకి రాకముందు ఆమె ఏ రంగంలో అయితే ఉన్నారో ఆమెకు ఏ రంగం మీద అయితే పట్టు ఉందో... ఆ రంగానికి చెందిన కీలక బాథ్యతలను జగన్ ఎంపిక చేసినట్లుగా ఆ వార్తలు చెబుతున్నాయి.


జగన్ ఇప్పటికే కొంత మందికి నామినేటెడ్ పదవులను కేటాయించారు. అదే వసుసలో లక్ష్మీపార్వతీకి కూడా నామినేటెడ్ పదవి సిద్ధం అయ్యిందని చెప్పాలి.  మరి లక్ష్మీపార్వతి కోసం ఏ పదవిని ఎంపిక చేశారన్న విషయానికి వస్తే... రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారు పదవిని ఆయన లక్ష్మీపార్వతికి ఇవ్వనున్నారట. ఎన్టీఆర్ తో పరిచయానికి ముందు లక్ష్మీపార్వతి సాహిత్యం కళా రంగాల్లో కొనసాగారు కదా. 


మరింత సమాచారం తెలుసుకోండి: