``పవన్ కళ్యాణ్ ఒక చేతిలో తాళి....మరొక చేతిలో ఎగతాళి ఉంటుంది. తాళి ఎప్పుడు కడతారో, ఎవర్ని ఎప్పుడు ఎగతాళి చేస్తారో పవన్ కళ్యాణ్‌కే తెలియదు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ. పవన్ కళ్యాణ్ తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తున్నారు...పవన్ కళ్యాణ్ హావభావాలు,ఆవేశం తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు దీక్షలు చేయలేదు?`` అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకరబాబు సూటిగా ప్ర‌శ్నించారు. 


త‌న సొంత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా పవన్ దత్తపుత్రుడు వేషాలు వేస్తున్నారని సుధాక‌ర్ బాబు మండిప‌డ్డారు. ``ఇసుక కొరతకు కారణాలను అన్వేషించడంలో ప్రతిపక్ష పార్టీలు వైఫల్యం చెందాయి..చంద్రబాబు హయాంలో వేల కోట్ల రూపాయల ఇసుకను దోచుకున్నారు.. ఇసుకపై కొత్త పాలసీని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుకొచ్చారు. ఓడిపోయిన పవన్ కళ్యాణ్ సిగ్గులేకుండా రాజకీయాలు చేస్తున్నారు. పవన్ వెనుక ఉన్నవాళ్లు అందరూ చంద్రబాబు తొత్తులే..కార్పోరేట్ తొత్తులు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో చంద్రబాబు,కార్పోరేట్ సెక్టార్ తొత్తులు చెప్పిన వాళ్లకు సీట్లు ఇవ్వలేదా? సొంత పుత్రుడు లోకేష్ పనికిరాడని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్ని పుస్తకాలు చదివాడో తెలియదు కానీ ప్రతి  రోజు ఎల్లో మీడియా, చంద్రబాబు ఇచ్చిన పుస్తకాలు,స్క్రిప్ట్ మాత్రం దువుతున్నాడు.`` అని మండిప‌డ్డారు. 


పవన్ కళ్యాణ్ దృష్టిలో రాజధాని అంటే టీడీపీ నేతలు,సుజనాచౌదరి,లింగమనేని వాళ్లు భూముల కొనుక్కున్న రాజధానా అని ప్ర‌శ్నించారు. ``పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు ఆడుతున్న దొంగ నాటకాలు ఆపాలి. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే పవన్ కళ్యాణ్ కు భయం. అందుకే అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు..పవన్ కళ్యాణ్ దీక్షలో టీడీపీ నేతలు ఎందుకు కూర్చున్నారు..అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు సచ్చిలూరా? వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు నీ కంటికి కనిపించడం లేదు...జనసేన పార్టీ కార్యాలయ స్థలం ఎవరి దగ్గర కొన్నారు.. ఎంతకు కొన్నారని అడిగితే సమాధానం లేదు..పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్‌లో భవన నిర్మాణ కార్మికులు లేరు.. టీడీపీ కార్యకర్తలే ఉన్నారు`` అని మండిప‌డ్డారు. 


చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బైటకు రావాలని వైసీపీ నేత కోరారు. ``ఓడిపోయిన వారికి సిగ్గురావాలి. ఎందుకు ఓడిపోయామో విశ్లేషణ చేసుకోవాలి. ఆ విశ్లేషణ వదిలి ఆరునెలల ఈ నూతన ప్రభుత్వాన్ని నీ మాటలతో చేతలతో విమర్శలు చేస్తే నీ చేతగాని తనానికి,సినిమా వేషాలకు పరాకాష్ట గా మేం భావిస్తున్నాం. మీరు చట్టసభలలో ప్రవేశించింది లేదు.151 మంది ఎమ్మెల్యేల‌ను రమ్మనండి. అంటున్నారు.ప్రజాప్రతినిధులను సవాల్ చేస్తారా. చట్టసభల సభ్యుల గురించి మీకేం తెలుసు. వారిని సవాల్ చేస్తారా. అందుకనే కార్పోరేటర్ కు ఎక్కువ ఎంఎల్ ఏ కు తక్కువ అన్నాం. మేం చెప్పే రాజధానిలో అన్ని వర్గాలవారు ఉండాలి. మీరు నిర్మించుకున్న రాజధానిలో ఉపాధి కోల్పోయిన కూలీలు ఉన్నారా.వారి ఉపాధి గురించి ఎప్పుడైనా మాట్లాడారా.ఎందుకు మాట్లాడరు.`` అని నిల‌దీశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: