ఏపీలో విప‌క్ష టీడీపీ ఇప్పుడు ఓ నెంబ‌ర్ పేరు చెపితేనే వ‌ణికిపోతోంది. అదే నెంబ‌ర్ 23. ఈ 23వ నెంబ‌ర్‌కు టీడీపీకి చాలా లింక్ ఉంది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు వైసీపీ నుంచి ఈ 23 మంది ఎమ్మెల్యేల‌ను లాగేసుకున్నాడు. ఇక ఈ యేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ అన్నే సీట్ల‌కు ప‌రిమితం అయ్యింది. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మే 23. టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 23. కానీ ఇందులో ఎంతమంది ఉంటారో..ఎంత మంది జంప్ అవుతారో అనే భయం టీడీపీ నేతల్లో మొదలైంది.


ఇప్ప‌టికే గన్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న పార్టీలో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు టీడీపీ వాళ్ల‌కే మ‌రో ఐదారుగురు ఎమ్మెల్యేల‌పై న‌మ్మ‌కం లేదు. వాళ్లు వాళ్ల అవ‌స‌రాల నేప‌థ్యంలో ఎప్పుడైనా పార్టీ మారిపోవ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇక టీడీపీలోనే ఐదారుగురు ఎప్పుడైనా వెళ్లిపోతార‌న్న సందేహం ఉంటే ఇటీవ‌ల‌ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన ప్రకటన మ‌రింత ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.


ఇప్ప‌టికే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఏకంగా 16 మంది తమ పార్టీతో టచ్‌లో ఉన్నారు….మీరు రండి అంటూ జగన్‌ ఒక్క మాట అంటే వాళ్లంతా బాబును వ‌దిలేసి జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస్తార‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వైసీపీ డిప్యూటీ సీఎం చెప్పిన‌ట్టు ఆ 16 మంది ఎమ్మెల్యేలు ఎవ‌రా ? అని ఒక్క‌టే టెన్ష‌న్ న‌డుస్తోంది. రాష్ట్రంలో అధికారం పోయిన కొద్ది కాలానికే టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యలు సైకిల్‌ దిగేసారు.


ఇక ఇప్పుడు వంశీ త‌ప్పుకుంటే పార్టీకి కేవ‌లం 22 మంది మాత్ర‌మే మిగులుతారు. వీరిలో కూడా 16 మంది జంప్‌ చేస్తే తెలుగుదేశానికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతోంది. ఇక అప్పుడు పార్టీలో ఉండేది బాబు, బాల‌య్య‌తో పాటు బుచ్చ‌య్య చౌద‌రి, గ‌ద్దె రామ్మోహ‌న్ వీళ్లే మిగులుతార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: