మంత్రి హోదా....ఇది ఎవరికున్న వారికి సకల గౌరవ, మర్యాదలు దక్కుతాయి. ప్రతి అధికారి... మంత్రులని గౌరవించాల్సిందే. ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాల్సిందే. కానీ ఏపీలోని ఇద్దరు మంత్రులకు ఇదే దక్కడం లేదట. తమని అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, గౌరవించడం లేదని ఆ మంత్రులు తెగ ఫీల్ అయిపోతున్నారట. ఇంతకీ అంతలా ఫీల్ అవుతున్న మంత్రులు ఎవరో కాదు. ఒకరు విశాఖ జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కాగా, మరొక మంత్రి శ్రీకాకుళంకు చెందిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్.


తమకు అధికారులు ఏ మాత్రం మర్యాద ఇవ్వడం లేదని వీరు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మొన్నటివరకు విశాఖలో గంటా శ్రీనివాసరావు  మంత్రిగా ఉన్నప్పుడూ, అధికారులు రోజు సలాం చేసేవారు. ఎప్పుడు చుట్టూనే ఉంటూ, ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించే వారు. కానీ ఇప్పుడు అదే సీన్ తన దగ్గర లేదని అవంతి...అధికారులకు డైరెక్ట్ గానే క్లాస్ తీసుకున్నారు.


తాజాగా జిల్లాలో జరిగిన సమావేశంలో అధికారులు ప్రోటోకాల్ పాటించాలని, కొత్తగా ఎవరు బాధ్యతలు స్వీకరించినా...వెంటనే తనని కలవాలని అవంతి గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. అంత‌టి వార్నింగ్ ఇచ్చినా కూడా అవంతి మాట‌లు చాలా మంది అధికారులు లైట్ తీస్కొంటున్న‌ట్టు భోగ‌ట్టా. అటు ధర్మాన కృష్ణదాస్ పరిస్తితి అయితే మరింత దారుణంగా ఉందట. ఆయన మెతక వైఖరి వల్ల అధికారులు ఎవరు...ఆయన్ని లెక్క చేయడం లేదని తెలుస్తోంది.


ఆయన ఇచ్చిన ఆదేశాలని పట్టించుకోకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధర్మాన బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. కొందరు అధికారులు అయితే ఇప్పటికీ టీడీపీకి అనుకూలంగా ఉన్నారని, వారిని ఉపేక్షించేది లేదని ధర్మాన స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నట్లు తెలిసింది. మొత్తానికైతే ఈ ఇద్దరు మంత్రులు అధికారుల దగ్గర నుంచి మర్యాద కావాలని  గట్టిగా కోరుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: