తెలుగుదేశం పార్టీ ఒక పక్క ఇబ్బందులు పడుతూనే ప్రభుత్వంపై విమర్శలను మాత్రం ఆపడం లేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తన రాజకీయానికి కాలం చెల్లింది అనే విషయాన్ని గ్రహించకుండా తన అనుకూల మీడియాతో కథనాలు రాయిస్తూ తన రాజకీయాన్ని కొనసాగిస్తూ పార్టీ నేతలకు కూడా విసుగు తెప్పిస్తున్నారు. ఇటీవల కొంత మంది నేతలు గడప దాటాలని చూసారు. వారికి ఏదోక విధంగా నచ్చజెప్పి ఆపేసిన చంద్రబాబు ఇప్పుడు వారిని కట్టడి చేసేందుకు తనకు ఉండే ఒక ఛానల్ ద్వారా సరికొత్త ప్రచారానికి తెరలేపారు.


అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేయటంతో వైసీపీ నేతలు కూడా భయపడుతున్నారని ప్రచారం చేయించడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లటం రాజకీయంగా ఇబ్బందికరమైన పరిణామమని వైసీపీ నేతలు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారు అంటూ కథనాలు రాయిస్తున్నారు.


ఈ కథనాల ద్వారా తెలుగుదేశం పార్టీని వీడుతున్న వారికి జ్ఞానోదయం కలిగించాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఇటీవల పార్టీలో చంద్రబాబుకి నమ్మదగిన నేతలుగా ఉన్న కొందరు జ‌గ‌న్‌ను గుడ్ బాయ్‌గా చెప్పేందుకు ప్రయత్నించగా వారిని కట్టడి చేశారు. ఇప్పుడు మరికొంత మంది పక్క చూపులు చూస్తున్నారనే విషయం తెలుసుకుని కథనాలు రాయించడం మొదలుపెట్టారు.


ఇక పార్టీ మారాలని చూస్తున్న యువనేతలకు... జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు అంటూ హిత బోధ చేయడం గమనార్హ౦. ఇప్పటికే జనసేన పార్టీని మోయడం మొదలు పెట్టిన చంద్రబాబు ఆ పార్టీని బిజెపిలో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తుండటం, తెలుగుదేశం పార్టీకి ఇక భవిష్యత్తు కష్టమే అనే ప్రచారం చేయడంతో రెండు పార్టీల నేతలు ఇబ్బంది పడుతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: