అన్నీ ప‌ద్ద‌తిగానే ఉన్నాయి...కానీ అస‌లు ఫ‌లితం మాత్రం తేల‌డం లేదు. ప‌క్క రాష్ట్రమైన మ‌హారాష్ట్రలో బీజేపీ-శివసేనా కలిసి పోటీ చేసి.. అధికారం చేపట్టేందుకు సరిపడా సీట్లను గెలుచుకున్నాయి. అయితే ఎక్కువ సీట్లు వచ్చినందున తామే సీఎం పగ్గాలు చేపడతామని బీజేపీ స్పష్టంచేస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం సీఎం పదవిని పంచుకోవాల్సిందేనంటూ శివసేనా తెగేసి చెబుతోంది. ఇదే స‌మ‌యంలో... శివసేనా నేతల వ్యాఖ్యలు చూస్తుంటే.. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారం చేపట్టేందుకు అటు ఎన్సీపీ, కాంగ్రెస్‌లు కూడా శివసేనా వైపు చూపులు చూస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజకీయం ఎటూ తేలడం లేదు.బీజేపీకి ఎటువంటి సంఖ్యా బ‌లం లేని రాష్ట్రాల్లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డంలో అమిత్ షాకు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ద‌ని, మ‌హారాష్ట్ర‌లో అమిత్ షా త‌న రాజ‌కీయ స‌త్తాను ప్ర‌ద‌ర్శించాల‌ని ప‌వార్ స‌వాల్ విసిరారు.


మ‌హారాష్ట్రలో అసెంబ్లీ ఫ‌లితాలు వెలుబ‌డి రెండు వారాలు గ‌డుస్తున్నా.. ఇంకా అక్క‌డ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌లేదు. బీజేపీ-శివ‌సేన కూట‌మే ఎన్నిక‌ల్లో పైచేయి సాధించింది. కానీ అధికారం పంప‌కం విష‌యంలో ఆ రెండు పార్టీల మ‌ధ్య విబేధాలు వ‌చ్చాయి. దీంతో ప్ర‌భుత్వ ఏర్పాటు ఆల‌స్యం అవుతోంది. ఇలాంటి త‌రుణంలో...ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ఇవాళ ముంబైలో మాట్లాడుతూ..ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ ఏర్పాటులో ఆల‌స్యం జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. బీజేపీ ర‌థ‌సార‌థి అమిత్‌షాకు ఆయ‌న ఓ స‌వాల్ విసిరారు. మ‌హారాష్ట్ర‌లో అమిత్ షా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని  ప‌వార్ స‌వాల్ విసిరారు. మ‌హారాష్ట్ర‌లో అమిత్ షా త‌న రాజ‌కీయ స‌త్తాను ప్ర‌ద‌ర్శించాల‌ని  అన్నారు.

ఇప్ప‌టికే శివ‌సేన‌కు చెందిన సంజ‌య్ రౌత్‌.. రెండుసార్లు ప‌వార్‌ను క‌లిశారు. కానీ మ‌హా ప్ర‌తిష్టంభ‌న తొల‌గ‌డం లేదు. 175 మంది ఎమ్మెల్యేల స‌పోర్ట్ ఉంద‌ని రౌత్ పేర్కొన్నా.. దాంట్లో క్లారిటీ లేద‌ని ప‌వార్ అన్నారు. మేం కేవ‌లం ప్ర‌తిప‌క్షంలోనే కూర్చుంటామ‌ని ప‌వార్ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. శివ‌సేన‌తో తాము పొత్తు పెట్టుకోబోమ‌ని స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: