స్థానిక జ‌పం చేస్తున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన‌ర్ణ‌యాల ఫ‌లితంగా భార‌తీయుల‌కు ఎదుర‌వుతున్న ఇక్క‌ట్ల‌లో మ‌రో సంచ‌ల‌న అంశం వెలుగులోకి వ‌చ్చింది. అమెరికాలో వలసలను తగ్గించి స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు ట్రంప్‌ సర్కార్‌ వీసా నిబంధనలను కఠినతరం చేసిన పుణ్యామా అని ఇండియ‌న్లు ఇబ్బందులు ప‌డుతున్నారు.  అమెరికా అధ్యక్షుని నినాదం భారతీయ సాంకేతిక నిపుణులతో పాటు స్వదేశీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు శాపంగా పరిణమిస్తోంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక హెచ్‌ 1 బీ వీసాల తిరస్కరణ రేటు 6 నుంచి 24 శాతానికి పెరిగింది.వీటిలో 90 శాతానికి పైగా భారతీయులకు చెందిన వీసాలే తిరస్కరణకు గురవుతుండ‌టం...క‌ల‌వ‌రానికి కార‌ణంగా మారింది.


నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ అధ్యయనంలో సంచ‌ల‌న  అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. ట్రంప్ నిబంధనల కారణంగా ఇటీవల హెచ్‌-1బీ వీసా తిరస్కరణలు భారీగా పెరిగినట్లు తాజా అధ్యయనంలో తేలింది. 2015లో కేవలం 6శాతం వీసా తిరస్కరణలు ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 24శాతానికి పెరిగిందని వివ‌రించింది. రద్దైన వీసాల్లో అధికంగా భారత ఐటీ కంపెనీల నుంచి వచ్చినవే కావడం విశేషం. భారతీయ కంపెనీల దరఖాస్తులు కనిష్టంగా 37 నుంచి గరిష్టంగా 62 శాతం తిరస్కరణకు గురయ్యాయి. టెక్ మహీంద్రా 41 శాతం, టాటా కన్సల్టెన్సీ  34 శాతం, విప్రో 53 శాతం, ఇన్ఫోసిస్‌కు చెందిన 45 శాతం వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. 


మ‌రోవైపు అమెరికా కంపెనీల‌కు చెందిన వీసాలు మాత్రం క్లియ‌ర్ అయిపోతున్నాయి. యాపిల్‌, ఫేస్‌బుక్‌లు సమర్పించిన 99శాతం దరశాస్తులకు గ్రీన్‌సిగ్నల్‌ పడింది. ఇదే స‌మ‌యంలో...నామ‌మాత్రంగా కొన్ని వీసాలే..రిజెక్ట్ అవుతున్నాయి. గూగుల్‌ 2 శాతం, మైక్రోసాఫ్ట్‌ 5 శాతం, అమెజాన్‌ 3 శాతం, ఇంటెల్‌ 8 శాతం హెచ్‌1బీ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ట్రంప్ విధాన‌లు...భార‌తీయుల‌ను అమెరికా క‌ల‌ల‌కు దూరం చేస్తోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: