వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేసిన రెండేళ్లయిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు పండుగ చేసుకుంటున్నారు. ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంటున్నారు. విపక్షంలో ఉన్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడిందీ తలచుకుంటున్నారు. పాదయాత్రతో జగన్ చరిత్ర సృష్టించారన్నారు ఎమ్మెల్యే ఉదయభాను.


ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రతో ఒక చరిత్ర సృష్టించాడని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన వైయస్‌ జగన్‌ ఐదు నెలల్లోనే ప్రజారంజక పాలన అందిస్తున్నాడన్నారు. నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. మేనిఫెస్టోలోని హామీలను ఐదు నెలల్లోనే 90 శాతం నెరవేర్చారన్నారు.


వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర దేశ చరిత్రలో నిలిచిపోతుందని మరో ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. పాదయాత్ర ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులను మార్చిందన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి కుటుంబం నా కుమారుడు, నా తమ్ముడు అని పాదయాత్ర చేస్తున్నాడని భావించారన్నారు.


మహాప్రస్థానం పేరుతో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్థితిగతులు, పేదల బతుకులు మార్చారన్నారు. అదే విధంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తరువాత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ఐదు నెలల కాలంలోనే కులం, మతం, వర్గం, పార్టీ, రాజకీయం లేకుండా ప్రతి ఒక్కరికీ మేలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉండాలని ఇతర రాష్ట్రాలు చెప్పుకునే విధంగా పాలన సాగిస్తున్నాడన్నారు.


సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాదయాత్ర ఒక చరిత్ర సృష్టించిందని ఏపీ పబ్లిక్‌ అఫైర్స్‌ అడ్వయిజర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా, సీఎం ప్రోగ్రామింగ్‌ కోఆర్డినేటర్‌ తలశీల రఘురాం సీఎం క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: