ఈనెల రెండో తేదీన ఆర్టీసి సమ్మె పై ఒక కేబినెట్ మీటింగ్ అనంతరం మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  రాష్ట్రంలోని సగం రోడ్లను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ఈనెల 5వ తేదీ లోపు విధుల్లోకి చేరితే ఆర్టిసి అనేది ఉంటుంది అని.. లేని తరుణంలో మిగిలిన రోడ్లను కూడా ప్రైవేటు రంగానికే ఇచ్చే చేస్తామని కేసీఆర్ తెగేసి చెప్పాడు. 

ఇకపోతే గత ముప్పై మూడు రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇప్పుడు కొంచెం డీలా పడింది అనే చెప్పాలి. సీఎం కేసీఆర్ మాటలు విని కొంత మంది కార్మికులు సమ్మె నుండి విడిపోయి వారి విధుల్లో చేరారు. అది కూడా అతి తక్కువ మంది మాత్రమే సీఎం మాటలకి లోబడినట్లు తెలుస్తోంది. అయితే కెసిఆర్ పిలుపుతో విధుల్లో చేరిన ముగ్గురు సిబ్బందిపై ఆర్టీసీ కార్మికులు దాడికి పాల్పడ్డారు. కండక్టర్ కోమల, డ్రైవర్ తాజుద్దీన్, వాజీద్ లపై ఆర్టీసీ కార్మికులు దాడి చేసి కొట్టి అక్కడ ఉద్రిక్త పరిస్థితులను రేకెత్తించారు. 

అయితే విధుల్లో చేరే కార్మికులకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని కెసిఆర్ చెప్పిన వారిని దాడి పాలు కాకుండా ఉండడం లో పోలీసులు విఫలమయ్యారు. వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ లోని ఆర్టీసీ బస్సును అడ్డగించిన కార్మికులు విధుల్లో చేరిన వారిపై కూడా దాడికి దిగారు. బస్సులో కండక్టర్ మరియు డ్రైవర్ను బయటకు లాగి కొట్టారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. సిబ్బందిపై దాడి తర్వాత ఆర్టీసీ కార్మికులు డిపో లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని నిలువరించడం తో ఇరువర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. అయితే వారి హక్కులను సాధించేందుకు ఆర్టీసీ వాళ్ళు చేస్తున్న పోరాటంలో తమ వారిపైనే తాము దాడి చేసుకోవడం అనేది మంచి సూచికను ఇవ్వడం లేదనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: