వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా దూకుడుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన పాలనాపరంగా ఎవరినీ ఖాతరు చేయరు. ఆయన ప్రజా సంక్షేమం ద్రుష్టిలో  ఉంచుకుని పాలన చేస్తారు అని అధికారులే చెబుతారు. ఆయన పేదల విషయం వచ్చేసరికి బిజినెస్ రూల్స్  ని దాటి మరీ సాయపడాలని అంటారని కూడా చెప్పుకుంటారు. ఇక సామాజిక చైతన్యంతొ పాటు కీలకమైన మార్పుల విషయంలోనూ జగన్ పాలన ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన బయటకు ప్రచారం చేసుకోకపోయినా అన్ని వర్గాలా సమాదరణ జగన్ సర్కార్ లో కనిపిస్తొందని అంటున్నారు.


ఇదిలా ఉండగా జగన్ అన్న గారుగా అంతా పిలుచుకునే నందమూరి వారి కోరికను ఆయన చనిపోయిన పాతికేళ్ళ తరువాత నెరవేర్చారు. అన్న గారి రెండవ భార్యగా ఉన్న లక్ష్మీ పార్వతికి జగన్ తెలుగు అకాడమీ చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఎన్టీయార్  కలను తీర్చారనే చెప్పాలి. ఎందుచేతనంటే ఎన్టీయార్  ఎపుడూ విద్త్వత్తుకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ విధంగా లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవడం వెనక కూడా ఆమెకు ఉన్న అపూర్వమైన భాషా పాండిత్యం చూసి మురిసిపోయినందుకేనని చెబుతారు.


ఇక అన్న గారు తాను 1995లో ముఖ్యమంత్రిగా అయ్యాక లక్ష్మీ పార్వతికి ప్రభుత్వంలో సముచితమైన స్థానం కల్పిద్దామనుకున్నారు. అయితే ఆయన సర్కార్ కేవలం 8 నెలలకే కూలిపోయింది. ఆ తరువాత ఆయన మరణం, లక్ష్మీ పార్వతి ఒంటరి కావడం జరిగింది. ఇపుడు జగన్ ఆమెను పిలిచి మరీ తెలుగు అకాడమీ చైరన్ పదవి ఇవ్వడం అంటే ఏ లోకాన ఉన్నా కూడా అన్నగారు తప్పక సంతోషిస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. పైగా లక్ష్మీపార్వతి ఈ పదవికి పూర్తిగా అర్హురాలు కూడా.


ఇక ఆమె వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చేరి విశేషంగా సేవలు అందిస్తున్నారు. 2014 లో కానీ, 2019 లో కానీ ఆమె పార్టీ తరఫున పోటీకి టికెట్ కూడా ఆశించలేదు. పైగా కీలకమైన సమయాల్లో ఆమె జగన్ కి అండగా నిలిచి పార్టీ తరఫున బలమైన వాణిని వినిపిస్తూ వచ్చారు. ఆమెకు ఈ పదవి దక్కడం పట్ల వైసీపీ నేతలతో పాటు నందమూరి అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: