ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు ఖాతాలు ఉన్నవారిని టార్గెట్ చేసి వారి అకౌంట్లలోని డబ్బును ఖాతాదారులకు తెలియకుండానే మాయం చేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా జాగ్రత్త పడవచ్చు. 
 
బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ లో ఇచ్చిన ఫోన్ నంబర్ ను ఉపయోగిస్తున్న ఫోన్ తో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ఎట్టి పరిస్థితులలోను ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎవరికీ చెప్పొద్డు. మొబైల్ ఫోన్ లో ఏటీఎం పిన్, పాస్ వర్డ్స్ వివరాలను నిక్షిప్తం చేసుకోకూడదు. ఎవరైనా కాల్ చేసి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పిన్, ఎంపిన్ సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితులలోను చెప్పకూడదు. 
 
బ్యాంకు అధికారులు ఇలాంటి వివరాలు అడగరనే విషయం గుర్తుంచుకోవాలి. ఎవరైనా ఫోన్ చేసి మీ మొబైల్ లో వన్ టైమ్ పాస్ వర్డ్ చెప్పమని అడిగితే ఎట్టి పరిస్థితులలోను చెప్పకూడదు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ఎటువంటి సమాచారం చెప్పకూడదు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఏదైనా యాప్ డౌన్ లోడ్ చేసుకోమని చెబితే అలాంటి వాళ్లు మోసగాళ్లని గుర్తించాలి. 
 
కస్టమర్ కేర్ నంబర్లు కావాలంటే గూగుల్ లో వెతకకుండా సంబంధిత కంపెనీ వెబ్ సైట్ లో వెతికితే మంచిది. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ మొబైల్ లోని సెట్టింగ్స్ మార్చమని కోరితే ఎట్టి పరిస్థితులలోను మార్చకూడదు. కొందరు సైబర్ మోసగాళ్లు మీ మొబైల్ నుండి ఎస్ఎంఎస్‌ను ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్ కు పంపమని అడిగితే ఎట్టి పరిస్థితులలోను పంపొద్దు. ఎస్ఎంఎస్‌ పంపితే అవతలి వారు మీ అకౌంట్ తో యూపీఐ క్రియేట్ చేసి లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఆధార్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను పెట్టకపోవటం మంచిది. పేమెంట్ యాప్స్ కు యాప్ లాక్ ఉపయోగించి లాక్ చేసుకుంటే మంచిది. మీకు తెలియకుండా మీ ఖాతా నుండి మోసపూరిత లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకులో, సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: