ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉల్లిపాయల వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో 47 మంది వ్యాపారులు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ 47 మందిలో కొందరు అగ్రికల్చర్ మార్కెటింగ్ ఫీజును ఎగవేశారని మరికొందరు అక్రమంగా భారీగా ఉల్లిపాయలను నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. విజిలెన్స్ అధికారులు దాడుల్లో 27 లక్షల రూపాయల విలువ చేసే ఉల్లిని స్వాధీనం చేసుకున్నారు. 
 
విజిలెన్స్ అధికారులు 37 మంది వ్యాపారులకు జరిమానాలను విధించటంతో పాటు నోటీసులను జారీ చేశారు. విజిలెన్స్ అధికారులు 10 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. అధికారులు హోల్ సేల్ వ్యాపారులు 50 మెట్రిక్ టన్నులు, రిటైల్ వ్యాపారులు 10 మెట్రిక్ టన్నులు ఉల్లిని మాత్రమే నిల్వ ఉంచుకోవాలని హెచ్చరిక చేశారు. విజిలెన్స్ అధికారులు 603 క్వింటాళ్ల ఉల్లిని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఉల్లికి కొరత సృష్టించి డిమాండ్ పెంచి ఎక్కువ ధరకు విక్రయించాలని కొందరు వ్యాపారులు అక్రమంగా ఉల్లిని నిల్వ చేయటంతో ఉల్లి రేట్లు పెరుగుతున్నాయి. 70 మంది వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేయగా 47మంది నిబంధనలను ఉల్లంఘించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ అధికారులు దాడులను కొనసాగిస్తామని చెబుతున్నారు. 
 
మహారాష్ట్ర, కర్నూలు నుండి వ్యాపారులు ఉల్లిని దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మార్కెట్ సెస్ ఎగ్గొట్టేందుకు స్టాక్ రిజిస్టర్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. వ్యాపారులలో కొందరు సేల్స్ బిల్లులు కూడా లేకుండా ఉల్లిని నిల్వ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర 50 రూపాయల నుండి 70 రూపాయలు పలుకుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కిలో ఉల్లి గరిష్టంగా 120 రూపాయలకు కనిష్టంగా 80 రూపాయలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేందుకు విదేశాల నుండి ఉల్లిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: