అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి విజయారెడ్డి సజీవదహనానికి కారణమైన నిందితుడు సురేశ్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తహశీల్దార్ పై పెట్రోల్, కిరోసిన్ చల్లి నిప్పంటించిన సురేశ్ అదే రోజు అదే ఘటనలో గాయాలపాలయ్యాడు. పోలీసులు నిందితుడు సురేశ్ కు గాయాలు కావటంతో ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స చేయిస్తున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడైన సురేశ్ ఒక భూవివాదం కారణంగా విజయారెడ్డిని హత్య చేశాడు. ఈ ఘటనలో తహశీల్దార్ డ్రైవర్ తహశీల్దార్ ను కాపాడబోయి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేశ్ ను ఆస్పత్రిలో చేర్చారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఆయన వెంటిలేటర్ పై ఉన్నారని తెలిపారు.. సురేశ్ మూడు రోజులుగా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
 
గత రెండు రోజుల నుండి సురేశ్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ముఖం, ఛాతీ కాలిపోవటంతో సురేశ్ శరీరం చికిత్స చేసినా చికిత్సకు స్పందించలేదని తెలుస్తోంది.  సురేశ్ వాంగ్మూలంలో తనపై కూడా పెట్రోల్ పోసుకున్నట్లు చెప్పాడు. 65 శాతం కాలిన గాయాలతో సురేశ్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. 
 
 పోలీసులు రెండు స్టేట్ మెంట్లను రికార్డ్ చేశారని తెలుస్తోంది. తన భూమికి సంబంధించిన పట్టా ఇవ్వకపోవటం వలన విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించానని సురేశ్ తెలిపాడు. తనంతట తానుగా దాడికి పాల్పడ్డానని ఎవరి ప్రమేయం లేదని సురేశ్ విచారణలో చెప్పినట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: