తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 34 వ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే రోజురోజుకు సమ్మె ఉదృతం అవుతుంది. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కారం దిశగా సానుకూలంగా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె ముగింపు ఏంటనే దానిపై  అందరూ రాష్ట్రంలో చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్లు విధిస్తు   హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఆర్టీసీ సంస్థ ముగుస్తుంది... సమ్మె ముగింపు ఏమి లేదంటూ కేసీఆర్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికి మూడు సార్లు డెడ్లైన్లు విధించారు  ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక తాజాగా  విధించిన డెడ్ లైన్  తో కూడా ఆర్టీసీ కార్మికులు ఎక్కడ వెనక్కి తగ్గలేదు. 



 సమ్మె యథాతథంగా కొనసాగుతుందని  ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆర్టీసీలోని సగం పైగా రూట్లు ప్రైవేటు పరం చేసిన కేసీఆర్ ఇక తాజాగా కేసీఆర్ విధించిన డెడ్లైన్ లోగ  కార్మికులు విధులకు చేరకపోవడంతో మిగిలిన రూట్లను  కూడా ప్రైవేటు పరం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో  సమ్మె చేస్తున్న  ఆర్టీసీ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంటని తెలంగాణ రాజకీయాల్లో  చర్చ  నడుస్తుంది .ఈ  క్రమంలోనే  అటు  ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులు అందరూ దిగాలు చెందుతున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి కెసిఆర్ తమ డిమాండ్లను  పరిష్కరించకుండా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసి   తమ  ఉద్యోగం నుంచి తొలగిస్తే తమ భవిష్యత్తు ఏమిటన్న ఆందోళన చెందుతున్నారు. 



 ఈ నేపథ్యంలో చాలా మంది కార్మికులు తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారబోతుందేమో  అని టెన్షన్ పడుతున్నారు... ఈ టెన్షన్ తట్టుకోలేక కొంత మంది గుండెపోటుతో మరణిస్తున్నారు.. ఇంకొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  తమ ఉద్యోగాలను తొలగించి ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తే తన భవిష్యత్తు ఏంటో అని  తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇక తాజాగా ఒక కండక్టర్ ఆర్టీసీ సమ్మె తర్వాత తమ పరిస్థితి ఏమిటని మనస్థాపం చెంది... మతిస్థిమితం కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో కండక్టర్ నాగేశ్వర్ భవిష్యత్తుపై తీవ్ర ఆందోలన  చెంది ఏకంగా పిచ్చివాడు  అయిపోయాడు. ఇప్పటికే కార్మికులందరికీ ఆత్మహత్యల ద్వారా గుండెపోటు వల్ల  మరణిస్తే తాజాగా నాగేశ్వర్ మతిస్థిమితం కోల్పోయాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: