అధికారులపై తెలుగుదేశంపార్టీ నేతలు ప్రైవేటు కేసులు వేయాలని డిసైడ్ అయ్యారు. అనంతపురంలో మాజీ ఎంపి జేసి దివాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్డీవో వరప్రసాద్ పై తాను కేసు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అధికారులపై కోర్టుల్లో ప్రైవేటు కేసులు పెడతామంటూ కొద్ది రోజులుగా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం తెలిసిందే.

 

ఆర్డీవోపై కేసు పెట్టబోతున్నట్లు జేసి ఎందుకు చెప్పారు ? ఎందుకంటే జేపి ట్రావెల్స్ కు చెందిన 80 బస్సులను సీజ్ చేశారట. మరి బస్సులను సీజ్ చేయటానికి ఆర్డీవోకు ఏమిటి సంబంధమే తెలీదు. బస్సుల సీజ్ వ్యవహారం రవాణాశాఖ చూసుకుంటుంది కదా ? మరి ఆర్డీవో పై కేసు ప్రస్తావన ఎందుకు తెచ్చారో ? తొందరలోనే మరింతమంది అధికారులపై టిడిపి నేతలు కేసులు వేయబోతున్నట్లు సమాచారం.

 

పైగా తమ పార్టీ నేతలను జగన్ టార్గెట్ చేస్తున్నట్లు మరో ఆరోపణ కూడా చేశారు జేసి. వైసిపిలో చేరితే వేధింపులు ఉండవని చేరకపోతేనే కేసులతో వేధిస్తామని బెదిరిస్తున్నట్లు జేసి ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇతర పార్టీల నుండి నేతలను ఎవరినీ చేర్చుకోవాల్సిన అవసరమే లేదని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే జేసి మాత్రం విరుద్ధంగా ఆరోపిస్తుండటమే విచిత్రంగా ఉంది. 

 

గడచిన నాలుగు నెలల్లో కొందరు టిడిపి నేతలు వైసిపిలో చేరింది వాస్తవమే. అయితే వాళ్ళంతట వాళ్ళుగానే తాము వైసిపిలో చేరుతామంటూ స్ధానిక నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి, బతిమలాడుకున్న తర్వాతనే జగన్ అంగీకరించి చేర్చుకున్నారు. తనను తాను తప్పిపోయిన గొఱ్ఱెగా వర్ణించుకున్న జూపూడి ప్రభాకర్, మాజీ ఎంఎల్ఏ వీరశివారెడ్డి, విశాఖపట్నం జిల్లాలో  అడారి కృష్ణమోహన్ లాంటి వాళ్ళు బతిమలాడుకుంటేనే జగన్ చేర్చుకున్నారు.

 

వాస్తవాలు ఇలాగుంటే జేసి మాత్రం అందుకు విరుద్ధంగా జగన్ పై ఆరోపణలు చేస్తే ఎవరైనా నమ్ముతారా ? లేకపోతే తాము వైసిపిలో చేరుతామంటే జగన్ ఏమన్నా వద్దన్నారా ? ఆ అక్కసుతోనే జేసి ఇలా మాట్లాడుతున్నారా ? అన్నది తొందరలోనే తేలిపోతుంది లేండి.


మరింత సమాచారం తెలుసుకోండి: