రాజకీయాల్లో ఓటమి తర్వాత కొంతమంది నేతలు ఫుల్ గా  సైలెంట్ అయిపోతారు ఇది రాజకీయాల్లో కామన్. అయితే ఆంధ్ర ప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్ పై మరో నాయకుడు తెర మీదికి రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయనెవరో కాదు  టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి నారాయణ. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం తర్వాత నారాయణ  పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  ప్రతిపక్ష టీడీపీ,  అధికార వైసీపీ ఎన్ని విమర్శలు ప్రతి విమర్శలు  చేసుకున్నప్పటికీ మాజీ మంత్రి నారాయణ మాత్రం ఎక్కడ స్పందించలేదు. ఓవైపు వైసీపీ నేతలు అందరూ నారాయణ కమిటీ తోనే ఏపీ రాజధాని అమరావతి ని  నిర్మించారంటూ  విమర్శలు గుప్పించినప్పటికీ... నారాయణ స్పందించలేదు టిడిపిలో కీలకంగా వ్యవహరించిన నారాయణ ఇన్ని రోజుల నుండి సైలెంట్ గా  ఉన్నారు. 



 అయితే తాజాగా టిడిపి నేతలతో కలిసి బుధవారం రాజధాని ప్రాంతంలో నారాయణ  పర్యటింటం  ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే గత ఎలక్షన్లలో ఓటమి తర్వాత  నుండి అసలు ఎక్కడ తెరపైన కనిపించకుండా సైలెంట్ అయిపోయిన మాజీ మంత్రి నారాయణ... సడన్ గా తెరపైకి రావడం ఆంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. టీడీపీ పార్టీలో కీలక నేతగా ఉన్నప్పటికీ సైలెంట్ అయిపోయిన నారాయణ మరోసారి పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అమరావతి ఏర్పాటు విషయంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు నారాయణ . అటు వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతి విషయంలో టీడీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండడంతో... దీనిపై మాజీ మంత్రి నారాయణ మౌనంగా ఉండటం మంచిది కాదని స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు సూచించడంతో నే ఆయన మరోసారి పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చారని సమాచారం. 



 అమరావతిలో నిర్మాణాలు, సిఆర్డిఏ వ్యవహారాలపై అమరావతి ఏర్పాటు లో కీలకంగా వ్యవరించిన నారాయణకు  స్పష్టమైన అవగాహన ఉందని చంద్రబాబు భావిస్తున్నారని... ఈ నేపథ్యంలోనే అమరావతి విషయంలో టిడిపిపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ కి  నారాయణతో కౌంటర్ ఇప్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. టిడిపిలో కీలక నేత మాజీ మంత్రి నారాయణ మరో సారి పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి వచ్చే అంశమె . ఎందుకంటే పార్టీలోనే కీలక నేతలు అందరూ పార్టీని వీడుతున్న తరుణంలో... నారాయణ లాంటి కీలక నేత మరోసారి పొలిటికల్ స్క్రీన్ పై కి రావడంతో చంద్రబాబుకు కాస్త ఊరట కలుగుతుందని టిడిపి వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే గత ఎన్నికల ఓటమి తర్వాత ఇప్పుడు వరకు నేరుగా వైసీపీ ప్రభుత్వం గాని,  ముఖ్యమంత్రి జగన్ పై కానీ ఎలాంటి విమర్శలు చేయని నారాయణ... ఇప్పుడు మరోసారి పొలిటికల్ స్క్రీన్ పైకి రావడంతో వైసీపీని,  సీఎం జగన్ ను ఎలా టార్గెట్  చేస్తారు అనేది ప్రస్తుతం  ఆంధ్రా రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: