తాజా గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేటేడ్ పోస్ట్ అయిన తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా లక్ష్మీపార్వతిని నియమించారు. గతంలో తెలుగు హాస్య నటుడైన బలిరెడ్డి పృథ్వీ రాజ్ ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా జగన్ నియమించారు. తనను నమ్ముకొని వచ్చిన ఈ నటుడికి పెద్ద పదవిచ్చినట్లే.. పోయిన సార్వత్రిక ఎలక్షన్స్ ముందు వైసీపీ లో చేరిన సీనియర్ నటుడు మోహన్ బాబు కి పెద్ద పదవే ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మోహన్ బాబుకు వచ్చే సంవత్సరం లోపు రాజ్యసభకు ఖాళీ అయ్యే ఎంపీకి  నామినేట్ చేయనున్నట్టు జగన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

 

 
 
మోహన్ బాబు సీనియర్ ఎన్టీఆర్ సహాయంతో తెలుగు దేశం పార్టీ లో జాయిన్ అయ్యి ఆ తర్వాత రాజ్య సభ సభ్యుడిగా పనిచేశాడనే విషయం తెలిసిందే. (ఇపుడు మళ్ళీ మోహన్ బాబు కి జగన్ అదే పదవిని ఇవ్వబోతున్నాడని సమాచారం.) ఎన్టీఆర్ మరణాంతరం చంద్రబాబు సీఎం అయ్యారు.. ఆపై మోహన్ బాబు క్రమక్రమంగా టీడీపీ కి దూరమయ్యాడు. కొన్ని సంవత్సరాల ముగిసిన తర్వాత వైస్సార్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గా ఎన్నికవడంతో కాంగ్రెస్ పార్టీ కి దగ్గరయ్యాడు మోహన్ బాబు. మంచు విష్ణు రాజశేఖర రెడ్డి సోదరుడు కూతురిని విహహం చేసుకోవడంతో వైస్సార్ కుటుంబానికి మంచు ఫ్యామిలీ బాగా దగ్గరైంది. 

 

 
తనను నమ్ముకొని వచ్చిన వారికే కీలకమైన పదవులను ఇచ్చిన వైసీపీ లీడర్ జగన్ మోహన్ రెడ్డి.... పోను పోను మంచు ఫ్యామిలీ కి ఎంత పెద్ద పెద్ద పదవిలిస్తారో ఊహించవచ్చు. అందుకే నామినెట్ పదవి కాకుండా ఢిల్లీ రాజకీయాలలో మంచు మోహన్ బాబుని పరిమితం చేస్తాడని జగన్ మోహన్ రెడ్డి సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: