ఏసిబి అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది . టౌన్ ప్లానింగ్ విభాగం లో వివిధ స్థాయిల్లో పని చేసి, ప్రస్తుతం  విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న  బాలగోని మురళి గౌడ్,  ఆస్తులపై మూడు రాష్ట్రాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలం లో  దాడులు నిర్వహించారు.  మొత్తం ఆరు బృందాలుగా విడిపోయిన అధికారులు నంద్యాల, తిరుపతి,  బెంగుళూరు,  హైదరాబాద్,  విజయవాడలో తనిఖీలు నిర్వహించారు .  నంద్యాలలో ఎనిమిది ఎకరాల పొలం,  హైదరాబాద్ నంద్యాల లో రెండు భవనాలు, నంద్యాల తిరుపతిలో మూడు ప్లాట్లు ఉన్నట్లు అధికారులు ఇప్పటి వరకు  గుర్తించారు.


 మురళీగౌడ్  బ్యాంకు ఖాతాలో 20 లక్షలు ఉండగా,  తిరుపతిలోని అయన  బంధువుల ఇంట్లో 16 లక్షల రూపాయలు ,  మురళి గౌడ్ బావమరదుల ఇంట్లో మరో 16 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  వారి పేరుతో బెంగళూరులో భారీగా ఆస్తులు కూడబెట్టిన అధికారులు గుర్తించారు.  మురళి గౌడ్ భార్య పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలు,  బంగారు ఆభరణాలు లెక్కించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.  విజయవాడ రావడానికి ముందు మురళి గౌడ్ నంద్యాల,  తిరుపతిలో పని చేశారు ఆ సమయంలోనే ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి  ఉన్నారని  ఏసీబీకి ఫిర్యాదులు అందాయి.  నంద్యాలకు చెందిన మురళి గౌడ్ పురపాలక శాఖ శాఖ లో టెక్నికల్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరారు . తరువాత పదోన్నతులు పొంది తిరుపతిలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా పని చేశారు.


 ఆ సమయంలోనే మురళీ గౌడ్ విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి.  2014లో ఆయన విజయవాడలో సిఆర్డిఏ డిప్యుటేషన్ పై వచ్చారు . ఇటీవల  విజయవాడ నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన అయన పై గతం లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎసిబి అధికారులు  ఈ సోదాలు జరిపారు. మురళీ గౌడ్  సుమారు 100 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.  ఆయన


మరింత సమాచారం తెలుసుకోండి: