ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సుపరిపాలన అందిస్తూ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అయినా వెనుకాడడం లేదు.  రాష్ట్ర ప్రజల  సంక్షేమం కోసం ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మద్యానికి బానిసై ప్రజలు ఎవరూ తమ జీవితాలను పాడు చేసుకోవద్దు అనే ఉద్దేశంతో సంపూర్ణ మద్యపానం  దిశగా అడుగులు వేసేందుకు నిర్ణయించారు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.



 ఇప్పటికే ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోని బెల్టుషాపులు అన్నింటినీ మూసి వేయించి ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుపుతుంది. అంతేకాకుండా ప్రతి ఏడు మద్యం దుకాణాల సంఖ్య తగ్గించుకుంటూ వచ్చి... విడతలవారీగా రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగేలా చర్యలు చేపడుతుంది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మద్యం షాపుల సమయాలను తగ్గించి కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అంతేకాకుండా మద్యం ధరలు పెంచి సామాన్య ప్రజలు మద్యాన్ని కొనుగోలు చేయడానికి భయపడేలా నిర్ణయం  తీసుకున్నారు. 



 ఇక తాజాగా సంపూర్ణ మద్యపాన దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్లోని బార్ల  సంఖ్యను తగ్గించేందుకు నిర్ణయించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దీనికోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని... బార్లకు  అనుమతించే ముందు అధికారులు  జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు. అంతేకాకుండా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే బార్లలో మద్యం విక్రయించాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు  చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: