రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి అర్ధం కావు. నిన్న మొన్నటి వరకు కత్తులు దూసుకునే పార్టీలు మళ్ళీ వెంటనే స్నేహ రాగాలు పాడాతాయి. ముఖ్యంగా మన ఏపీలో ఇలాంటి రాజకీయాలు బాగా ఉంటాయి. అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇందులో ముందు ఉంటుంది. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న పార్టీలతోనే చంద్రబాబు స్నేహం చేసేస్తారు. ఆయన అసలు తిట్టని పార్టీలేదు. కలవని పార్టీ లేదు. 


2014 ఎన్నికల్లో బీజేపీ-జనసేనలతో కలిసి పోటీ అధికారంలోకి వచ్చిన బాబు....2019 ఎన్నికల్లో మాత్రం ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. పొత్తు లేకుండా పోటీ చేయడం వల్లే దారుణంగా ఓడిపోయానని బాబు తెలుసుకుని...ఇప్పుడు నిదానంగా బీజేపీ, జనసేనలకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ విషయాన్ని పక్కనబెట్టేస్తే బాబు...ఈ మధ్య పవన్ తో బాగా క్లోజ్ అవుతున్నట్లు కనబడుతుంది. 


వైసీపీ నేతలు పవన్ ని విమర్శిస్తే బాబు అసలు ఊరుకోవడం లేదు. అటు బాబు వైసీపీ ప్రభుత్వంపై ఏ రకమైన విమర్శలు చేస్తున్నారో...వాటినే పట్టుకుని పవన్ కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక ఇటీవల అయితే వీరి స్నేహం మరింత బలపడినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇసుక కొరతని నిరసిస్తూ పవన్ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి పవన్ అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఫోన్ చేసి మద్ధతు అడిగారు. అందరూ పరోక్షంగా మద్ధతు తెలిపిన మార్చ్ కు మాత్రం రాలేదు. 


కానీ చంద్రబాబు తమ మాజీ మంత్రులని సభకు పంపారు. ఇక ఇక్కడ నుంచి వీరి మధ్య మైత్రి మరి బలపడింది. అయితే ఈ స్నేహం మళ్ళీ చిగురించడానికి....రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలే కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీని నిలవరించడం ఏ ఒక్క పార్టీకి సాధ్యం కాదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో పొత్తుగా అన్న వెళితే కొన్ని సీట్లు అయిన దక్కించుకోవచ్చని టీడీపీ-జనసేనల వ్యూహంగా కనబడుతుంది. మరి చూడాలి వీరి స్నేహం ఎక్కడ వరకు వెళుతుందో?


మరింత సమాచారం తెలుసుకోండి: