అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్ధార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ మృతి పట్ల గౌరెల్లి గ్రామస్థులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు . విజయారెడ్డి హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంటున్న  నేపధ్యం లో సురేష్ మృతి చెందడం అనుమానాలకు తావునిస్తోందని పలువురు పేర్కొంటున్నారు . సురేష్ మరణం వెనుక ఏదైనా కుట్ర ఉందేమోనని గౌరెల్లి గ్రామస్థులు అంటున్నారు . అయితే సురేష్ , 65 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రి లో చికిత్స కు చేరిన విషయాన్ని ఈ సందర్బంగా వైద్యులు గుర్తు చేస్తున్నారు .


 తల, ఛాతి భాగం తీవ్రంగా కాలిపోవడం వల్ల, సురేష్ ఆరోగ్య పరిస్థితి మొదటి నుంచి ఆందోళనకరంగా ఉందని మొదటి నుంచి చెప్పుకొచ్చినట్లు వారు  వెల్లడించారు . భూవివాదం కారణంగా తహశీల్ధార్  విజయారెడ్డి ని సురేష్ దారుణంగా హత్య చేసిన అనంతరం , తాపీగా నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు . విజయారెడ్డి పై పెట్రోల్ పోసి నిప్పంటించే సమయం లో సురేష్ కు కూడా మంటలు అంటుకోవడం , అతను కాలిన గాయాలతో బాధపడుతుండడం తో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసుల పర్యవేక్షణ లోనే సురేష్ కు వైద్యులు చికిత్స అందించారు . 


అయినా సురేష్ మృతి పై అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. విజయారెడ్డి హత్య లో కూడా కుట్ర కోణం దాగి ఉందని  అధికార టీఆరెస్ , కాంగ్రెస్ పార్టీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు . బాచారం లోని భూవివాదం లో  ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ప్రమేయం ఉందని మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించగా , మల్ రెడ్డి కుటుంబ సభ్యులకే ఈ భూవివాదం తో ప్రమేయం ఉందని మంచి రెడ్డి అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: