వైసీపీలో ఎమ్మెల్యే ఆర్కే రోజా అంటే ఫైర్ బ్రాండ్ అన్న సంగతి తెలిసిందే. ఎంతటి వారినైనా కడిగిపారేస్తుందని పేరు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అన్నా.. లోకేశ్ అన్నా.. రోజా ఓ రేంజ్ లో ఫైర్ అవుతుందని తెలుసు. కానీ ఇటీవల పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు.


వైసీపీ అధికారంలోకి రావడంతో రోజాుకు ఏదో ఒక మంత్రి పదవి దక్కుతుందని అంతా ఆశించారు. కానీ అనేక సమీకరణాల కారణంగా రోజాకు మంత్రి పదవి దక్కలేదు.అందుకే ఏపీఐఐసీ ఛైర్మన్ గా వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. చేసేది లేక రోజా ఆ పదవితో సర్దుకుపోతున్నారు.


ఇదే నేపథ్యంలో ఆమెకు పెద్దగా మీడియా ముందుకు వచ్చే అవకాశాలు రావడం లేదు. తాజాగా ఇసుక సమస్యపై చంద్రబాబు, పవన్ నానా యాగీ చేస్తుండటంతో రోజా మరోసారి తన సహజ స్వరూపాన్ని బయటపెట్టారు. మరోసారి తనదైన శైలిలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఓటమి కారణంగా చంద్రబాబుకు మతిభ్రమించినట్టుందని, చిన్న మెదడు చితికిందని ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.


రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్ చల్లని పాదం మోపడంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని, దాంతో ఇసుకకు కొద్దిమేర ఇబ్బంది ఏర్పడిందని ఆర్కే రోజా అన్నారు. అయితే దీనిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. విపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని ఆర్కే రోజా అన్నారు. ఏపీలో వైయస్‌ జగన్ పాలన చూసి పొరుగు రాష్ట్రాల వారు కూడా ఇలాంటి ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నారని రోజా అన్నారు.


ఇసుక సమస్యను ప్రతిపక్షాలు బాగా హైలెట్ చేస్తూ ఉండటంతో వైసీపీ నాయకులు కూడా అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు. రోజుకో నాయకుడు ఈ అంశంపై ఘాటుగానే సమాధానాలు ఇస్తున్నారు. ఈ సమయంలో రోజా కూడా తన వంతు డోస్ అందించారనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: