ఏపీ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. రాజకీయం అంటే అదే మరి అక్కడ తర తమ భేదాలు అసలు ఉండవు. అంతిమ లక్ష్యం  చేరే వరకూ బంధాలు అనుబంధాల‌ పట్టింపులు కూడా ఉండవు. ఏపీ విషయానికి వస్తే ఇప్పటివరకూ మోడీ జగన్ ల బంధం బాగానే ఉంది. అయితే దాన్ని చూసి సహించలేని పరిస్థితుల్లో టీడీపీ జనసేన ఉన్నాయి. తాను ఢిల్లీ వెళ్ళి ప్రధాని, ఇతర పెద్దలను కలుస్తానని పవన్ అంటున్నారు. వైసీపీ నేతల విషయలు చెప్పి భాగోతం బయటపెడాతని కూడా బెదిరిస్తున్నారు.


మరో వైపు విజయసాయిరెడ్డి మీదకే ఆయన డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. జగన్ కి కుడిభుజమని తెలిసి ఈ రకంగా చేయడం వెనక వ్యూహమే ఉందని అంటున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. వచ్చే ఆదాయం పెద్ద ఎత్తున  తగ్గిపోయింది. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ ఆదాయం చూస్తే గణనీయంగా పడిపోయింది. మధ్యం అమ్మకాలను తగ్గించడం వల్ల ఆ  ఆదాయానికి గండి పడింది. ఈ పరిస్థితుల్లో జగన్ ఇస్తున్న హామీల జాబితా కొండవీటి చాంతాడులా ఉంది.


మరో వైపు జగన్ 2 లక్షల 27 వేల కోట్ల బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ లో లక్ష కోట్లు చూసుకుంటే కేంద్రం నుంచి పన్నుల వాటా,  గ్రాంట్ల ద్వారా వస్తాయని ఆశపడి మరీ అంచనా కట్టారు. ఇప్పటికి ఏడు నెలలు గడిచాయి. కేంద్రం నుంచి గట్టిగా వచ్చింది 22 వేల కోట్లు మార్త్రమే. ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి మరో ఇరవై కోట్లు రావచ్చునంటున్నారు. అంటే కేంద్ర సాయం మీద ఆశ పెట్టుకుంటే అరవై వేల కోట్లు లోటు వస్తుందన్న మాట.


ఇక ఏపీలో ఆదాయాలు అన్నీ తగ్గడం, అభివ్రుధ్ధి లేకపోవడం, నిర్మాణ రంగం కుదేలు కావడం ఆర్ధిక మాంద్యం కారణంగా బడ్జెట్లో వైసీపీ సర్కార్ పేర్కొన్న విధంగా మిగిలిన  లక్షా 22 వేల కోట్ల మేర ఆదాయం రాదు అంటున్నారు. అందులో ఎంత లోటు వచ్చినా కూడా వైసీపీ  ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఆపేయాల్సి వుంటుంది. మరి కేంద్రం వైపు చూస్తున్న జగన్ కి మోడీ మొండి చేయి ఇస్తారా. లేక ఆదుకుంటారా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: