దేశంలో నవంబర్ 8 వ తేదీ వచ్చిందంటే చాలు.. అందరు భయపడిపోతుంటారు.  కారణం ఏంటో తెలుసా.. నోట్ల రద్దు .  2016 నవంబర్ 8 వ తేదీన మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది.  నోట్లను రద్దు చేయడంతో ప్రజలు షాక్ అయ్యారు.  నోట్లను రద్దు చేయడం ఏంటి అని ప్రశ్నించారు.  పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో చాలా మార్పులు వచ్చాయి.  అయితే, 2019 ఎన్నికలపై దీని ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది అనుకున్నారు.  కానీ, ఒక్క శాతం కూడా ఎఫెక్ట్ లేకపోవడంతో షాక్ అయ్యారు. 


2019 ఎన్నికల్లో మోడీ అఖండ మెజారిటీతో విజయం సాధించారు.  ఈ విజయంతో మోడీ రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది.  2019 నవంబర్ లో సుప్రీమ్ కోర్టు నుంచి అనేక కేసులు తుదితీర్పు రాబోతున్నాయి.  ఇందులో అయోధ్య, రఫెల్ తీర్పులు ముఖ్యమైనవి.  బహుశా ఈరోజు ఈ రెండు తీర్పుల్లో ఒక తీర్పు ఏమైనా బయటకు వస్తుందేమో చూడాలి.  మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని తేదీలు చాలా ముఖ్యంగా మారాయి.  కీలకమైన నిర్ణయాలను ఈ తేదీల్లోనే తీసుకుంటున్నారు.  


అందులో ఒకటి నోట్ల రద్దు కాగా, రెండోది జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు.  ఈ రెండు మేజర్ విషయాలు.  ఈ రెండు విషయాల్లో ఇండియా పురోగతిని సాధించింది.  2016 నవంబర్ 8 న నోట్లరద్దు చేస్తే, ఆగష్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దు చేశారు.  ఈ రెండింటితో మోడీ ప్రభుత్వం డేరింగ్ స్టెప్ తీసుకుంది.  మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ స్టెప్ కారణంగా దేశంలో ఎన్నో మార్పులు జరిగాయి.  ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నా జమ్మూ కాశ్మీర్ విలీనం అక్టోబర్ 31 తో జరిగిపోయింది.  


ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లు ఇండియాలో పూర్తిగా విలీనం అయ్యాయి.  ఇప్పుడు మిగిలింది పీవోకే.  పీవోకే విషయంలో ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది తెలియాల్సి ఉన్నది.  త్వరలోనే ఈ విషయంలో మోడీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం అర్ధం అవుతున్నది.  మోడీ తీసుకునే నిర్ణయంపైనే అందరి చూపులు ఉన్నాయి.  మోడీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  నవంబర్ 8 వ తేదీ అయిన నేడు దేశంలో ఎలాంటి సంచలన నిర్ణయాలు జరగకుండా ఉంటె మంచిది.  దేశాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలైతే మెచ్చుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: