రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉన్నది.  దేశంలో ఎక్కువమంది రోడ్డు ప్రమాదాల కారణంగానే మరణిస్తున్నట్టు ఇప్పటికే నివేదికలు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఓ ప్రమాదం జరిగింది.  నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నుంచి కొరిడి గ్రామానికి బయలుదేరిన బస్సు ప్రమాదవశాత్తూ పులికాట్ సరస్సులోకి బోల్తా కొట్టింది.  ఈ బస్సులో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు.  


అయితే, బస్సు సరస్సులో పడినా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.  చిన్న దెబ్బలతో బయటపడ్డారు.  గాయపడిన వ్యక్తులను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు.  ప్రమాదానికి కారణాలు ఏంటి అనే దానిపై ఆరా తీస్తున్నారు.  ఇటీవలే గోదావరిలో పడవ ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో 40 మందికి పైగా మృత్యువాత పడ్డారు.  ఇందులో 5 మంది జాడ ఇప్పటి వరకు కనిపించలేదు.  26 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు.  


ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. ఏదో ఒక కారణంతో బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి.  ఈ ప్రమాదాల్లో నిత్యం ఎంతోమంది మరణిస్తున్నారు.  తలకు హెల్మెట్ పెట్టుకోకపోవడం, అతివేగం వంటి వాటివలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.  వాహనం నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, జాగ్రత్తగా వాహనాన్ని నడపాలని ప్రజలను అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు.  


మాములుగా చెప్తే వినడం లేదని చెప్పి చట్టాలను కఠినం చేస్తున్నారు.  చట్టాలను కఠినం చేస్తే.. దానిపై ప్రజలు గొడవ చేస్తున్నారు.  చట్టాలను కఠినం చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.  హెల్మెట్ పెట్టుకోకుంటే వెయ్యి ఫైన్ వేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.  హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేసి.. ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే హెల్మెట్ పెట్టుకొని ఫైన్ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి హెల్మెట్ పెట్టుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు.  ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా మార్పులు వస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: