మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం – తానుబట్టిన కుందేటికి మూడేకాళ్ళు అంటూ మొండిగా ముందుకెళుతున్న శివసేనకు ఆదిలోనే హంసపాదు -- పడేలా ఉంది. మొదటికే మోసం వచ్చే  పరిస్థితి రానుందని సమాచారం. వంశపారంపర్య వారసుడు 'ఆదిత్య  ఠాక్రే' ను ముఖ్యమంత్రి  చేయడం కోసం ఉద్దవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌లు పట్టుపట్టడంతో తొలుత ఆ పార్టీ శాసనసభ్యులు కూడా హుషారుగా మద్దతిచ్చినా ఇప్పుడు చాలామంది శివసేన ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత ప్రారంభమైందని అభిఙ్జ వర్గాల సమాచారం. చినికి చినికి గాలివానై -  మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశమే కారణంగా - శివసేన నిట్ట నిలువుగా చీలేటట్లుందని చెబుతున్నారు.


శివసేన భిన్నాభిప్రాయాలతో రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం బిజెపికి మద్దతు ఇచ్చి, ప్రస్తుత పరిస్థితికి ముగింపు ఇవ్వాలను కుంటుండగా, మరొక వర్గం 50-50 ఫార్ములా అమలుచేసి తీరాలని  పట్టబడుతోంది.  ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బిజెపిశివసేన పార్టీలు ఆ తరువాత ఏ మాత్రం పొసగని విధంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆలశ్యం జరుగుతోంది. శివసేన 50-50 ఫార్ములా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. దీని ప్రకారం మొదటి రెండున్నర సంవత్సరా లు శివసేన నేత ముఖ్యమంత్రిగా ఉంటారు. మరొక రెండున్నరేళ్లు బిజెపి నేత ముఖ్యమంత్రిగా ఉంటారని అంటుండగా, దీనిని బిజెపి నిర్ద్వందంగా తిరస్కరించింది. 


మహారాష్ట్రలో అధికారం తామే చేపడతామని, దేవేంద్ర ఫడ్నవీస్‌ వచ్చే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తారని కారణం తామే 'సింగిల్ లార్జెస్ట్ పార్టీ' అయినందున బిజెపి పట్టుదల ప్రదర్శిస్తుంది. అయితే, సీఎం ఎవరైనా సరే తొలుత శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడితే తమకు మంత్రి పదవులు వస్తాయని ఆశిస్తున్న శివసేన నేతలు కొందరు ఇప్పుడు సొంత పార్టీ పైనే మండి పడుతున్నారని సమాచారం. 


శివసేన నాయకత్వంపై వ్యతిరేఖత ఉన్న మరికొందరు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. దీంతో “జంపింగ్‌ భయం” తో శివసేన తన శాసనసభ్యుల ను “శారదా హొటల్‌” కు తరలించింది. అయితే ఈ విషయాన్ని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ మాత్రం తమ శాసనసభ్యులను హోటల్స్ కు, రిసార్టులకు తరలించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని వారు అమ్ముడుపోయే రకం కాదని ఆయన చెబుతున్నారు.
Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AMIT SHAH' target='_blank' title='amit shah-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>amit shah</a> behind <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SHIV SENA PARTY' target='_blank' title='shiv sena-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>shiv sena</a> split 
ఫ్లాష్ బాక్ 

“ఎవరికీ వారే యమునా తీరే” అన్న చందంగా సాగుతున్న మహారాష్ట్ర బీజేపీ-శివసేనల మైత్రి  శవంలోని బేతాళుడిని బయటకు తీసుకురావడనికి ఆనాడు ఛంద్రగుప్త విక్రమాధిత్య  మహారాజు పడిన కష్టం కంటే నేడు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి -ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడాని అంతకంటే ఎక్కువగానే కష్టపడుతున్నాయి. 

అయితే ఇప్పుడు మహా రాజకీయం మరింత మహారంజుగా తయారై ముదిరి పాకానపడుతుంది.  మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలో బీజేపీ - శివసేన కూటమి కలిసిపోటీ చేసి మెజారిటీ అయితే సంపాదించారు.  కానీ, సీఎం కుర్చీకోసం కుమ్ములాట మొదలెట్టారు. దీనితో ఎన్నికల ఫలితాలు వచ్చి వారం దాటుతున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారు.  శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టడం, దానికి బీజేపీ ససేమిరా! అనడంతో అసలు గొడవ మొదలైంది. దీనితో బీజేపీకి షాక్ ఇవ్వడానికి శివసేన అధినేత తెగించారు. 


తొలిసారిగా ఎన్సీపీ అధినేత శరత్ పవార్ తో మంతనాలు ప్రారంభించారు. బీజేపీతో బంధం తెంచుకుని శివసేన బయటకు వస్తేనే విషయం ముందుకు కదులుతుందని శరద్ చెప్పినట్లు సమాచారం. జరుగుతున్న పరిణామాలపై ఎన్సీపీ-కాంగ్రెస్ లు సమీక్ష జరిపాయి. ఒకవేళ శివసేన గనక మద్దతు కోరితే ఏం చెయ్యాలన్న దానిపై ఈ రెండు పార్టీలు చర్చలు జరిపాయి.


శివసేనకు మద్దతిచ్చే విషయంలో మొదట కాంగ్రెస్ హై-కమాండ్ అనుమతి తీసుకొని నా దగ్గరకు రండని శరద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి చెప్పినట్లు తెలుస్తుంది. దీనితో వెంటనే కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చలు జరుపు తున్నారు.

శివసేన శాసనసభాపక్షనేతగా ఏక్ నాథ్ షిండే ఎంపికయ్యారు.  అధికారాన్ని చెరి సగం కాలం (రెండున్నరేళ్లు) పంచుకోవాలన్న తమ డిమాండ్ విషయంలో వెనక్కు తగ్గేది లేదని కూడా శివసేన స్పష్టం చేసింది.  ఆలా చేయకపోతే  ఎన్సీపీ-కాంగ్రెస్ తో  కలిసి వెళ్తామని అన్యాపదేశంగా చెప్తుంది. కానీ ఇక్కడే శివసేన కి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది.  

అసలు 'అమిత్ షా చాణక్య వ్యూహ జాడలు నీడలు' వెలుగులోకి వస్తున్నాయి. “బీజేపీతో తెగతెంపులు చేసుకుని అధికారాన్ని వద్దనుకుంటే బీజేపీ శిబిరంలోకి జంప్ చేయటానికి 24 మంది శివసేన శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది”

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AMIT SHAH' target='_blank' title='amit shah-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>amit shah</a> behind <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SHIV SENA PARTY' target='_blank' title='shiv sena-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>shiv sena</a> split

మరింత సమాచారం తెలుసుకోండి: