సాధినేని యామినీ శర్మ తెలుగుదేశంపార్టీని వదిలి వెళ్ళిపోవటం వల్ల పార్టీకి ఎంత నష్టమో తెలుసా ? చంద్రబాబునాయుడి ప్రత్యర్ధులపై నోటికొచ్చినట్లు అడ్డదిడ్డంగా మాట్లాడే టిడిపి నేతల్లో యామిని కూడా ముందు వరసలోనే ఉండేవారు. కొంతకాలం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన కూడా అలాగే మాట్లాడింది. టిడిపికి శతృవుగా ఉన్నంత కాలం పవన్ పైన నోటికొచ్చినట్లు మాట్లాడింది. తర్వాత పవన్ పై మళ్ళీ గొంతు లేవలేదు.

 

సరే మొదటి నుండి కుడా జగన్నే టార్గెట్ చేసుకుంటూ ఆరోపణలు, విమర్శలతో చెలరేగిపోయేది. తాను మాట్లాడే విషయంలో పాయింటుందా ? లేదా అన్నదాంతో యామినికి ఎప్పుడూ ఆలోచన లేదు.  జగన్ పై విమర్శలతో చంద్రబాబు, నారా లోకేష్ ఎలాగైతే కడుపుమంటతో విరుచుకుపడుతుంటారో ఈ మహిళా నేతది కూడా అదే పద్దతి.

 

అసలు ఈమె పార్టీ క్షేత్రస్ధాయిలో ఏరోజు కూడా పనిచేసింది లేదు. ఏదో లోకేష్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఒక్కసారిగా పార్టీ అధికార ప్రతినిధిగా అపాయింట్ అయిపోయింది. సరే జగన్ కు వ్యతిరేకంగా  ఈవిడ చేసిన ఆరోపణలు, విమర్శలు ఎలాగున్నా జనాలైతే పట్టించుకోలేదు లేండి.  లోకేష్ తో సన్నిహితం కారణంగా మిగిలిన సీనియర్ నేతలతో సమన్వయం లేకుండానే సొంతంగా వ్యవహరించేవారని చాలా ఆరోపణలే ఉన్నాయి.

 

అలాంటి యామినికి  మొన్నటి ఎన్నికల్లో ఫలితం చూసిన తర్వాత మైండ్ బ్లాంక్ అయ్యిందనే చెప్పాలి. తనను తాను గొప్ప మేధావిగా భావించుకునే  ఈ మహిళా నేత తను చేసే ఆరోపణలకు, విమర్శలకు జనాలు బాగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు భ్రమపడింది. అందుకనే అవసరం, అనవసరం అన్న తేడా లేకుండా ఏది పడితే అది మాట్లాడేసింది.

 

అలాంటి అడ్డదిడ్డంగా మాట్లాడే నేత ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు సైలెంట్ అయిపోయింది. ఐదు నెలలుగా టిడిపి తరపున మాట్లాడింది లేదనే చెప్పాలి.  జగన్ ప్రభుత్వంపై  ఒకవైపు చంద్రబాబు అండ్ కో నానా యాగీ చేస్తున్నా యామిని గొంతు మాత్రం ఎక్కడా వినబడటం లేదు. టిడిపికి భవిష్యత్తు లేదనుకున్నారో ఏమో  ఆమధ్య బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. మరి బిజెపిలో చేరుతారో లేకపోతే తగిలిన ఎదురుదెబ్బ ఫలితంగా రాజకీయాలకే దూరమైపోతారో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: