పసిడి ధర దేశీ మార్కెట్‌లో గత మూడు రోజుల్లో ఏకంగా రూ.500కు పైగా పడిపోయింది. దీంతో బంగారం పట్ల ఆసక్తి ఉన్నవారు ఇప్పుడిప్పుడే బంగారాన్ని కొనడానికి ముందుకు వస్తున్నారు. అయినా గాని ఈ మధ్య కాలంలో భారీగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలను చూస్తుంటే మధ్య తరగతి వారి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.


ఇకపోతే వివిధ ప్రదేశాల్లోని బంగారం ధరలను ఒక సారి పరిశీలిస్తే. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు కనిపించ లేదు. కాబట్టి స్థిరంగా కొనసాగింది. దీంతో ధర రూ.39,900 వద్దనే ఉంది. ఇక అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధర అక్కడే ఉండిపోయిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.


అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కోసం తెలుసుకుంటే అది కూడా స్థిరంగానే ఉంది. ఇక దీని ప్రస్తుత ధర రూ.36,580 వద్దనే కొనసాగింది. అయితే పసిడి ధర గత మూడు రోజుల్లో రూ.510 మేర దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పైకి ఎగబాకి, రూ.250 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,750కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర నిలకడగానే కొనసాగుతుంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.38,550 వద్దనే ఉంది.


అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా రూ.37,350 వద్దనే కొనసాగింది. వెండి ధర మాత్రం పైకి కదిలితే, బంగారం ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. అదీ కాకుండా విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. ఇక ఈ మార్పులు రోజువారిగా జరుగుతుంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: