ఏపీలో బీజేపేకి నోటా కంటే ఓట్లు తక్కువ వచ్చాయి. ఆ ముచ్చట జరిగి ఏడు నెలలు మాత్రమే అయింది. కానీ బీజేపీ ఏపీలో తానే పెద్ద తోపు అంటోంది. దానికి కారణం ఏంటి. ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఓడినా కూడా టీడీపీ గ్రాస్ రూట్ లెవెల్లో గట్టిగానే  ఉంది. మరో వైపు బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి యువ నాయకుడు జగన్ ఉన్నారు. ఇక  ఏపీలో తన సత్తా చాటుదామని పవన్ కళ్యాణ్ కూడా ఎదురుచూస్తున్నారు. మరి ఇన్ని రకాలుగా ప్రాంతీయ శక్తులు అడ్డుతున్నా   బీజేపీకి ఉన్న ధీమా ఏంటి.


అంటే కేంద్రాన్ని చూపించే ఏపీలో బీజేపీ పాగా వేయాలనుకుంటోంది. దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలు బాగా వీక్ అయ్యాయి. కాంగ్రెస్ కి నాయకత్వ సమస్య ఉంది. వామపక్షాలు ఎన్నడూ లేని విధంగా క్షీణిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతీయ  పార్టీలకు వారి వారి సొంత సమస్యలు ఉన్నాయి. దాంతో జెండా ఇపుడు జోరుగా ఎగురుతోంది ఒక్క బీజేపీది మాత్రమే.


దాంతో పాటు తనకు ఉన్న సామదానభేదదండోపాయాలను కూడా ఉపయోగించి ప్రాంతీయ పార్టీలు ఎదగకుండా బీజేపీ కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనికి మహారాష్ట్రలోని శివసేనను వంచేస్తూండడమే ఒక పెద్ద ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇక ఏపీలో తీసుకుంటే టీడీపీకి బలం ఉన్నా కూడా నాయకత్వ సమస్య ఉంది. చంద్రబాబు నాయుడు వయసు ఇపుడు పెద్ద  మైనస్ గా ఉంది. మరో వైపు టీడీపీకి ఇప్పటికైతే వారసుడు లేనట్లే. లోకేష్ సమర్ధత మీద ఎవరికీ నమ్మకాలు అయితే  లేవు 


అందువల్ల వీలైనంతవరకూ బీజేపీ ఏపీలో టీడీపీ ప్లేస్ ని ఆక్రమించాలనుకుంటోంది. టీడీపీకి ఉన్న సామాజికవర్గాలను తన వైపు తిప్పుకుంటే రానున్న రోజుల్లో బలమైన శక్తిగా అవతరించగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. ఏపీకి ఈ నెల 10న రానున్న జేపీ నడ్డా సమక్షంలో  కమ్మ, కాపు సామాజిక వర్గాలకు చెందిన నేతలే ఎక్కువగా చేరుతున్నారట.  ఆ విధంగా ఇటు కులంతో పాటు, కోస్తాలో బలం పెంచుకుని ఆ మీదట రాయల‌సీమలో జగన్ కి సవాల్ విసిరేందుకు బీజేపీ రెడీ అవుతోంది. మొత్తం మీద బీజేపీ గట్టి వ్యూహాలతోనే ఏపీ బరిలోకి దిగుతోంది. చూడాలి మరి ఎంతవరకూ సక్సెస్ అవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: