మొన్నటివరకు రాష్ట్రంలో మాంచి ఆసక్తికరమైన టాపిక్ ఏదైనా ఉందంటే అది వల్లభనేని వంశీదే. ఆయనపై నకిలీ ఇళ్ల పట్టాలు పంచారనే కేసు నమోదవ్వడం, వెంటనే వంశీ జగన్ తో భేటీ కావడం, చంద్రబాబుకు వాట్సాప్ లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికు రాజీనామా చేసి పంపడం జరిగాయి. ఆ తర్వాత బాబు కేశినేని నాని, కొనకళ్ళ నారాయణలతో వంశీని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా సరే వంశీ వెనక్కి తగ్గలేదు. దీంతో టీడీపీ నేతలు ఇంకా లైట్ తీసుకున్నారు. అటు వంశీ కూడా 4 లేదా 5 తేదీల్లో వైసీపీలో చేరిపోతారని ప్రచారం జరిగింది.


కానీ 7వ తేదీ వచ్చిన వంశీ ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియకుండా ఉంది. ఇంకా ఆయన వైసీపీలో చేరలేదు. ఇటు టీడీపీలో కూడా లేరు. అయితే వంశీ చేరిక లేట్ అవ్వడానికి చాలానే కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయన వైసీపీలో చేరాలంటే జగన్ ముందు కొన్ని కోరికలు చిట్టా పెట్టినట్లు తెలుస్తోంది. అందులో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎమ్మెల్సీ లేదా ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం.


అలాగే దీనికంటే ముఖ్యంగా  వంశీకి హైదరాబాద్ లో కొన్ని ఆస్తులు, ఇళ్ల స్థలాలు ఉన్నాయి. వంశీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. కాకపోతే కొన్ని స్థలాలు వివాదాల్లో ఉన్నాయని తెలుస్తోంది. వాటిని పరిష్కరించాలని అక్కడ మంత్రి కేటీఆర్ ని కోరిన పెద్దగా స్పందించలేదట. ఇప్పుడు జగన్ ద్వారా చెప్పించాలని కోరుతున్నారట. అయితే వైసీపీ అధినేత మాత్రం ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.


ఎందుకంటే హైదరాబాద్ లో ఏపీకి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేల భూములు కూడా వివాదాల్లో ఉన్నాయని, ఇప్పుడు వంశీ విషయంలో జోక్యం చేసుకుంటే, మిగతా వాటి విషయంలో కూడా కలగజేసుకోవాలి. ఈ తలనొప్పి అంతా ఎందుకని వంశీ విషయంలో జగన్ సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. అందుకే వంశీ చేరిక మరింత ఆలస్యం అవుతుందని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: