తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అధికారులతో ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి చర్చలు జరుపుతున్నాడని సీఎం కేసీఆర్ ఆర్టీసీ సంఘాలతో గంటన్నర చర్చలు జరిపితే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పరిష్కారం లభిస్తుందని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఈరోజు హైకోర్టులో విచారణ అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి ఈ నెల 11వ తేదీలోపు సమస్యను పరిష్కరించాలని సూచించిందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. 
 
ఆర్టీసీ ఆర్థిక స్థితికి సంబంధించిన నివేదికలను హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించిందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. అధికారులు హైకోర్టును కూడా మోసం చేశారని హైకోర్టు వ్యాఖ్యానించిందని అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టు ఐఏఎస్ అధికారుల నివేదికలపై అసంతృప్తి వ్యక్తం చేసిందని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు కోరుకున్న డిమాండ్లు నెరవేరేంత వరకు సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి అన్నారు. 
 
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఆర్టీసీ మనుగడ కోసమేనని చెప్పారు. ఈ నెల 11వ తేదీలోపు సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు పిలవాలని అశ్వత్థామరెడ్డి కోరారు. సమ్మె చేస్తున్న కార్మికులు పట్టును సడలించకుండా సమ్మె కొనసాగించాలని అశ్వత్థామరెడ్డి అన్నారు. రేపు ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నామని అశ్వత్థామరెడ్డి చెప్పారు. 
 
మిలియన్ మార్చ్ కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కావాలని అశ్వత్థామరెడ్డి కోరారు. ఈరోజు హైకోర్టులో ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్ పై విచారణ జరిగింది. పిటిషన్ లో విశ్వేశ్వరరావు అనే వ్యక్తి తెలంగాణ కేబినేట్ నిర్ణయాలు నిలిపివేయాలని పేర్కొన్నాడు. విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వానికి సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని హైకోర్టు సూచించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె 35వ రోజుకు చేరింది. సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించటంతో విధుల్లో చేరిన కార్మికులు కొందరు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: