తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. అభివృద్ధిలో కాదండోయ్ లైంగికంగా సంక్రమించే వ్యాధుల్లో  మొదటి స్థానంలో ఉంది.టెక్నాలజీ పెరిగిపోవడం మాట ఏమో కానీ టెక్నాలజీని చెడు ఉపయోగిస్తున్న వారు  రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువత టెక్నాలజీ కారణంగా ఎక్కువగా చెడిపోతున్నారు. టెక్నాలజీ కారణంగా రోజురోజుకూ మారుతున్న పరిణామాల దృష్ట్యా ప్రజల్లో కూడా ఎక్కువగా మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు మంచిదే అయితే పర్వాలేదు కానీ చెడు మార్గంలో నడిచేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు నేటి ప్రజలు యువత. ఒకప్పుడు సెక్స్  అనే పదం పలకడానికి వెనుకా ముందూ ఆలోచించే వారు కానీ ... ఇప్పుడు లైంగిక వాంఛతో రగిలిపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు  చేతికి రావడంతో పోర్న్  చిత్రాలకి ప్రభావితం అవుతున్నారు యువత . ఈ నేపథ్యంలో తాము కూడా అలా చేయాలని భావించి ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే సెక్స్ లో  పాల్గొంటున్నారు. 



 దీంతో ఎక్కువగా సుఖ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అయితే తాజాగా వెల్లడైన సర్వే ప్రకారం లైంగికంగా సంక్రమించే వ్యాధుల్లో  తెలంగాణ దేశంలోనే నెంబర్వన్ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ 2018 సంవత్సరానికి  గాను విడుదల చేసిన నేషనల్ హెల్త్ ప్రొఫైల్ లో తెలుగు రాష్ట్రాల గురుంచి  విస్మయం కొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. 2018 సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 14, 940 మంది లైంగిక వ్యాధులు సంక్రమించాయి. కాగా వారిలో   4,824 మంది స్త్రీలు ఉన్నారు. అయితే దేశంలోనే ఇది అత్యధికమని నేషనల్ హెల్త్ ప్రొఫైల్ పేర్కొంది. 2018 లోనే కాదు  2017లో తెలంగాణలో 10, 880 లైగికంగా సంక్రమించే  కేసులు నమోదయ్యాయి.



 ఇక అటు  ఆంధ్రప్రదేశ్లో కూడా 2008లో 12, 484 మంది సెక్స్ ఇన్ఫెక్షన్స్ కారణంగా లైంగిక వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో 3,197 మంది పురుషులు ఉండగా... 9,247 మంది స్త్రీలు ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా మహిళలు లైంగిక సక్రమణ వ్యాధుల భారిన పడ్డారు.  ఇక సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటిలిజెన్స్ విడుదల చేసిన నేషనల్ హెల్త్ ప్రొఫైల్ లో రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత మధ్యప్రదేశ్ కర్ణాటక రాజస్థాన్ లు  ఉన్నాయి. కాగా  వీరంతా గోనొకక్కల్  అనే ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. అవగాహనా లేని అసురక్షిత శృంగారం, డయాబెటిస్ వ్యాధి భారిన పడటం వల్ల సుఖవ్యాధుల బారిన పడిన వారి సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నట్టు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: