తాజాగా ఇరాన్‌ దేశంలో ఘొర ప్రమాదకరమైన భూకంపం సంభవించడం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా 120 మంది గాయాలు అయ్యాయి. వందలాదిమంది ఇల్లు లేని వారీగా మారారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.9గా నమోదు కావడం జరిగింది. అక్కడి ప్రజల బాధ చెప్పలేని పరిస్థితిలో ఉంది. భూమి నుంచి 5 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలియచేయడం జరిగింది.


గత కొన్ని దశాబ్దాలుగా ఇరాన్‌ దేశంలో ఎన్నో విపత్తులను, ప్రళయకాలములో ఎదుర్కుంటోంది. 2003లో వచ్చిన భూకంపం దాదాపు 31,000 మందిని బాలి తీసుకోవడం జరిగింది. 1990లో 7.4గా నమోదైన భూకంపం దాదాపు 40,000మందిని బలి తీసుకోగా మూడు లక్షలమంది గాయాల పలు అయ్యారు. యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే విపత్తును ముందుగానే అంచనా వేయడం జరిగింది. ఇరాన్ దేశములో భూకంపం రాబోతుందని, ప్రాణనష్టం కూడా సంభవించే అవకాశముందని హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని పలు హెచ్చరికలు కూడా చేశారు.


ఇక అజర్‌బైజాన్‌ పరిధిలోని తాబ్రిజ్‌ నగరం నుంచి సుమారు120 కిలోమీటర్ల భూమి కంపించినట్టుగా అధికారిక తెలియచేయడం జరిగింది. భూమి నుంచి 5 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలియచేశారు. ఇలా  మనకు భూకంపము ముందుగా వస్తుందని తెలిసినా కూడా మనము ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనలేక పోతున్నాము. దీని వలన ఎన్నో కోట్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతున్నది.  అసలు భూగర్భంలో గల తప్పిదాల వలన, తీవ్రమైన వత్తిడిని విసర్జించే స్థితిలో భూకంపాలు సంభవిస్తాయి.


వాస్తవానికి  భూకంపం ఎలా వస్తుంది? భూకంప కేంద్రం ఎంత లోతులో ఉంటుంది? భూకంప తీవ్రతను ఎలా  చూస్తారో తెలుసుకుందామా మరి... భూమి లోపలి పొరలు తరుచుగా కదలికలో ఉంటాయి. ఆ కదలికల వలన భూమి బీటలు వారుతుంది. బీటలు వారిన ప్రదేశం చుట్టూ శక్తిని విడుదల చేస్తుంది. ఈ చర్య ఇలాగే కొనసాగినప్పుడు వాటి మధ్య ఒత్తిడి ఎక్కువై ఆ శక్తి పైకి ఎగదన్నుతూ వస్తుంటుంది. బీటలు వారినప్పుడు ఏర్పడిన ఖాళీల్లోంచి విడుదలైన శక్తి భూమి ఉపరితలానికి కంపనాల రూపంలో వస్తుంది. ఆ కంపనాలనే భూకంపంగా మారుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: