కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న చర్చలకు, గుసగుసలకు మరియు అనిశ్చతి కి గత సంవత్సరం సూపర్ స్టార్ రజినికాంత్  సంపూర్ణ రాజకీయాల్లోకి  వస్తున్నానని నేను ఎవరి పార్టీ లో చేరానని నేనే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం తో కొన్నిరోజులుగా జరుగుతున్నకాంగ్రెస్ లో చేరుతారా ? బీజేపీ లో చేరుతారా? లేదంటే కమల్ హసన్ ప్రకటించిన పార్టీ ని ఇద్దరు కలిసి నడిపిస్తారా? అన్న రాజకీయ అలజడికి సమాధానం దొరికినట్లుగా అనిపించింది.

కానీ కొన్ని రాజకీయ సమావేశాలు ఏర్పరిచి పార్టీ ని పెడుతున్నట్లు ప్రకటించినప్పటికీ పార్టీ పేరును మాత్రం ప్రకటించలేదు. అలాగే గతం లో జరిగిన ఎన్నికలకు కూడా వారు పోటీ చేయలేదు. పార్టీ గుర్తు గాని పార్టీ పేరు గాని ప్రకటించాక పోవడం తో మళ్ల్లీ  అభిమానులలో ఆందోళనల నేపథ్యం లో ఇటీవల జరిగిన ఒక ఫంక్షన్ లో  తాను బీజేపీలో చేరుతున్నానని వస్తోన్న వార్తలు నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ వాటిని ఖండిస్తూ ఒక ప్రకటన చేశారు. తనకు కొందరు బీజేపీ రంగు వేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.

కానీ ఏ మధ్య రజనీకాంత్ మోదీ ని కలిసాడని బీజేపీ పార్టీ లో చేరడానికి రజిని ఒప్పుకున్నాడని కొద్దిరోజులలో బీజేపీ లో చేరుతారని వచ్చిన వార్తల నేపథ్యం లో ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తుంది.  బీజేపీ వారి ఉచ్చులో నేను పడనని పేర్కొన్నారు. తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నటుడు కమలహాసన్ తో కలిసి రజనీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తమిళ ప్రాచీన కవి తిరువల్లూరు చిత్రం పైన  బీజేపీ ట్వీట్  చేస్తూ ఆమె విభూదిని నుదిటి , భుజాలకు మేడలో రుద్రాక్ష దందా తో ఉన్న ఫోటో షేర్ చేస్తూ రాసిన మాటలు పైన నెలకొన్నవివాదంపై మీ స్పందన ఏమిటని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, రజనీ సమాధానమిస్తూ తిరువల్లూరుతో పాటు తనపై కూడా కాషాయరంగు పులమాలని ప్రయత్నిస్తున్నారంటూ చెప్పారు. తమిళనాట రాజకీయం చాల ప్రమాద స్థితిలో ఉంది అని ఎక్కడ గందరగోళం  నెలకొందన్నారు. తాను రాజకీయ పార్టీ స్థాపించేవరకు సినిమాల్లో నటిస్తానని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: