ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్నారు. పొరుగు  రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా ఉండేలాగా ఆంధ్రప్రదేశ్లో పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ పథకం ప్రవేశపెట్టిన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానిపై  ప్రతిపక్ష టీడీపీ నేతలు  మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో జగన్  చేస్తున్న అభివృద్ధి చూసి  టిడిపి అధినేత చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు అందుకనే  అనవసర  విమర్శలకు దిగుతున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. 



 అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలందరికీ మెరుగైన విద్య అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రతి పేద విద్యార్థులు  స్కూల్ కు  వెళ్లి చదువుకోవాలనే  ఉద్దేశంతో అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి ఏటా 15 వేల రూపాయల  అందించేందుకు  నిర్ణయించిన జగన్ సర్కార్... ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. దీని కోసం జీవో జారీ చేసింది జగన్ ప్రభుత్వం. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి పేద విద్యార్థులకు కూడా మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సీఎం జగన్ నిర్ణయంపై  ప్రతిపక్ష టీడీపీలు మాత్రం విమర్శలు గుప్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం అనే కీలక నిర్ణయం పై కూడా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో... వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు పై ఘాటైన విమర్శలు చేశారు. 



 మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియం లోని చదివిస్తారు కానీ పేద ప్రజలు పిల్లలు  మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలని చంద్రబాబు బాబు భావిస్తున్నారని   విజయసాయిరెడ్డి అన్నారు . పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగ కూడదని బావన  టీడీపీ నేతల్లో ఉందంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు. పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులకు పోకూడదని  చంద్రబాబు లోకేష్ కళ్ళలో  నిప్పులు పోసుకుంటున్నారు అంటూ విమర్శించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం పై విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు నారా లోకేష్ లు... దేవాన్ష్  తెలుగు మీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి .


మరింత సమాచారం తెలుసుకోండి: