తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజు రోజుకు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది. అయితే ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 35వ రోజుకు చేరుకున్నప్పటికీ  ఇప్పుడు వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించలేదు. అంతేకాకుండా సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులను  ఉద్యోగాల నుండి  తొలగిస్తున్నట్లు ప్రకటించి హెచ్చరికలు  జారీ చేస్తున్నారు. హైకోర్టు విచారణలో  కూడా ఆర్టీసీ సమ్మెకు ఎలాంటి సానుకూల స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఆర్టీసీ జేఏసీ నేతలు తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9 వరకు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని  ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. 



 తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆర్టీసీ జేఏసీ నేతలు.కాగా తాజాగా  ఆర్టీసీ జేఏసీ నేతలకు  హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా చలో ట్యాంక్  బండ్ కి  పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ నేతలు. కాగా  ఆర్టీసీ జేఏసీ నేతలు తలపెట్టిన చలో ట్యాంక్ బండ్  కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.చలో ట్యాంక్ బండ్ కి అనుమితవ్వాలని వామపక్ష  నేతలు హైదరాబాద్ సీపీ  అంజన్ కుమార్ ని కలిసారు. అయితే ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన చలో ట్యాంక్ బండ్  కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని  వెల్లడించారు సీపీ అంజన్  కుమార్. అనుమతి లేకుండా చట్టాన్ని అతిక్రమిస్తూ చలో ట్యాంక్ బండ్ నిరసన  కార్యక్రమం చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 



 ఇక  శనివారం ట్యాంకుబండు పైకి ఎవరు వచ్చిన అరెస్టు చేయక తప్పదని స్పష్టం  చేసారూ. రేపు నిర్వహించబోయే చలో ట్యాంకుబండ్  నేపథ్యంలో  ఇప్పటికే ముందస్తు అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడీకే  కేసీఆర్ తీరుతో తీవ్ర ఆందోళన చెందుతున్న ఆర్టీసీ జేఏసీ నేతలు... మిలియన్ మార్చ్ తరహాలో చలో  ట్యాంక్ బండ్  నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని భావించిన ఆర్టీసీ జేఏసీ నేతలకు  పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో  బిగ్ షాక్ తగిలినట్లయింది. అయితే ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించిన ట్యాంక్ బండ్ కార్యక్రమానికి ప్రజా సంఘాలు పలు పార్టీలు సైతం మద్దతు ప్రకటించారు. అయితే పోలీసులు చలో ట్యాంక్  కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి నిరాకరించినప్పటికీ...  ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం కచ్చితంగా నిర్వహిస్తామని స్పష్టం చేయడంతో రేపు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: