ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో టిడిపి మునుపెన్నడూ లేనివిధంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న  విషయం తెలిసిందే. అయితే గత మూడు రోజులుగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా టిడిపి పార్టీ పరిస్థితి పై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం పై సమీక్ష నిర్వహించిన  చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముద్దుకృష్ణమ నాయుడు మరణానంతరమె  టీడీపీ అభ్యర్థిని ప్రకటించి ఉంటే నగరి నియోజక వర్గంలో  విజయం సాధించే వాళ్లుమని  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగానే నగరి నియోజక వర్గానికి టీడీపీ అభ్యర్థిని  ప్రకటించేందుకు ఆలస్యం చేయాల్సి వచిందని  చంద్రబాబు తెలిపారు. 



 నగిరి ఎమ్మెల్యే టికెట్ విషయంలో తాను  పునరాలోచించానని తెలిపిన చంద్రబాబు ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబ సభ్యులు కలుస్తారని భావించినట్లు  తెలిపారు. అందుకే నగరి అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఆలస్యం చేసానని  చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ ముద్దుకృష్ణమనాయుడు కుటుంబ సభ్యులు టీడీపీ పార్టీ ఓటమికి పని చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు ఆయన .ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబం అంతా కలిసి పనిచేసి ఉంటే ప్రత్యర్థి గెలిచేవాడు  కాదని ... వైసీపీ ఎమ్మెల్యే రోజా గెలుపుపై పరోక్షంగా ప్రస్తావించారు టీడీపీ అధినేత చంద్రబాబు. 



 రాజకీయాల్లో నాయకులుగా ఎదగాలనుకున్న నేతలు శత్రువులను ఎక్కువగా పెంచుకోకూడదు అంటూ చంద్రబాబు హితవు పలికారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు కొడుకు భాను కష్టపడితే ఒక మంచి నాయకుడిగా ఎదగగలడని చంద్రబాబు సూచించారు. అయితే మాజీ మంత్రి చెంగారెడ్డి ని పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందని ఆ పని టీడీపీ స్థానిక నేతలే చేయాలంటూ చంద్రబాబు సూచించారు. ఇదిలా ఉండగా 2014 ఎన్నికలు టిడిపి అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు పై  558 ఓట్ల మెజారిటీతో రోజా  విజయం సాధించగా... 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2,708 ఓట్ల మెజారిటీ తో  టిడిపి అభ్యర్థి గాలి భానుప్రకాష్ పై  విజయం సాధించారు. అయితే రోజా ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే గానే  కాకుండా.. ఏపీఐఐసీ చైర్మన్ గా  కూడా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: